Bigg Boss 9 Telugu Ayesha: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ పేరుతో వైల్డ్ కార్డ్స్ గా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో నిజమైన ఫైర్ స్ట్రోమ్ లాగా అనిపించిన కంటెస్టెంట్ అయేషా. ఈమె వచ్చిన మొదటి రోజే నామినేషన్స్ లో తనూజ ని టార్గెట్ చేస్తూ వేసిన నామినేషన్ పెద్ద సెన్సేషన్ అయ్యింది. విన్నర్ రేస్ లో ఉన్న తనూజ కి సరైన పోటీ వచ్చింది,టైటిల్ రేస్ వీళ్లిద్దరి మధ్యనే ఉంటుందేమో అనేంతలా ప్రభావం చూపించింది అయేషా. మధ్యలో అవసరం లేకపోయినా పెద్ద పెద్దగా అరుస్తూ గొడవలు పెట్టుకోవడం వల్ల కాస్త నెగిటివ్ అయిన విషయం వాస్తవమే కానీ, కొన్ని కొన్ని తగ్గించుకుంటే కచ్చితంగా ఈమె కూడా విన్నర్ మెటీరియల్ అనుకోవచ్చు. అయితే ఈ వారం ఈమె బిగ్ బాస్ హౌస్ ని వదిలి బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అదేంటి నామినేషన్స్ లో లేదు కదా?, ఎలా ఎలిమినేట్ అవుతుంది అని మీరంతా అనుకోవచ్చు. కానీ బాగా గమనిస్తే ఈ వారం జరుగుతున్నా టాస్కుల్లో ఆమె అసలు కనిపించడం లేదు. అందుకు కారణం ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడమే. డీ హైడ్రేషన్ కారణంగా ఆమె రెండు మూడు సార్లు హౌస్ కళ్ళు తిరిగి పడిపోయిందట. ఆమెని మెడికల్ రూమ్ కి పిలిచి డాక్టర్ల చేత వైద్యం కూడా ఇప్పించారట కానీ, ఇంకా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. అందుకే ఈ వారం ఆమెని బయటకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పారట. ఒకవేళ అయేషా ఇంటి నుండి వెళ్ళిపోతే, ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే అనుకోవచ్చు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన వారిలో తనూజ, రీతూ చౌదరి, సంజన, సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష, రాము రాథోడ్, దివ్య నిఖిత, పవన్ కళ్యాణ్ వంటి వారు ఉన్నారు.
Also Read: హౌస్ లోకి పోలీసులుగా ఎంట్రీ ఇచ్చిన అమర్ దీప్,అర్జున్ అంబటి..వీడియో వైరల్!
వీరిలో అందరికంటే టాప్ స్థానం లో ఉన్న కంటెస్టెంట్ తనూజ. ఆమె తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వీళ్లిద్దరి తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా దివ్య మూడవ స్థానం లో కొనసాగుతుంది. ఇక చివరి రెండు స్థానాల్లో మాత్రం సాయి శ్రీనివాస్ మరియు రమ్య ఉన్నారట. వీళ్ళిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న టాక్. కానీ అయేషా ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం అసలు ఎలిమినేషన్ ఉండదు. ఇదేదో గత వారం జరిగి ఉండుంటే భరణి లాంటి టాప్ కంటెస్టెంట్ ఈరోజు హౌస్ లో ఉండేవాడు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో.