Bigg Boss 9 Telugu Promo: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఏదైనా మిస్ అవుతుంది అంటే అది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కేవలం ఇమ్మానుయేల్ ఒక్కడే కామెడీ చేస్తున్నాడు కానీ, మిగిలిన కంటెస్టెంట్స్ నుండి మాత్రం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ రావడం లేదు. గత సీజన్ లో అవినాష్ వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చి ఏ రేంజ్ కామెడీ అందించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనతో పాటు టేస్టీ తేజ, రోహిణి వంటి కంటెస్టెంట్స్ కూడా ఆడియన్స్ కి పొట్టచెక్కలు అయ్యే రేంజ్ లో కామెడీ అందించారు. ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తున్న సీజన్ 8 ని ఈ ముగ్గురే పైకి లేపారు. కానీ పాపం ఇక్కడ ఇమ్మానుయేల్ కి అలా కామెడీ చేసే టీం లేదు. భరణి ఉన్నన్ని రోజులు తనూజ, దివ్య లను ఉపయోగించుకొని కామెడీ చేసేవాడు కానీ, భరణి వెళ్లిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది.
తన నాన్నని దూరం చేసినందుకు తనూజ మొన్నటి ఆదివారం నుండి ఇమ్మానుయేల్ తో మాట్లాడడం లేదు. ఇమ్మానుయేల్ ఈమెని సరదాగా ఆటపట్టిస్తూ చేస్తే టీజింగ్ చేసే సందర్భాలు చాలా ఫన్నీ గా ఉండేవి. కానీ ఆడియన్స్ ఇప్పుడు అవి బాగా మిస్ అవుతున్నారు. అందుకే హౌస్ లోకి అమర్ దీప్, అర్జున్ అంబటి లను పంపించారు. కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా అది బాగా వైరల్ అయ్యింది. వీళ్లిద్దరు పోలీస్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. 7వ సీజన్ లో ఇంద్ర జిత్ గా అర్జున్, కామజిత్ గా అమర్ దీప్ కలిసి చేసిన కామెడీ ఏ రేంజ్ లో పేలిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ పాత్రలనే కొనసాగిస్తూ ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లోకి రాగానే రీతూ చౌదరి, ఇమ్మానుయేల్ వీళ్ళిద్దరిని కామెడీ చేస్తూ స్వాగతించారు.
అలా హౌస్ లోకి వచ్చిన వీళ్ళు ఈ వారం టాస్క్ లో డాన్స్ గా పిలవబడుతున్న సంజన సైలెన్సర్, మాస్ మాధురి లను పట్టుకోవడానికి వస్తారు. వాళ్లిద్దరూ వీళ్లకు కనిపించకుండా దాక్కుంటారు. ఇక తర్వాత అర్జున్ హౌస్ లో ఇప్పటి వరకు ఏమైనా దొంగతనాలు చేసుంటే చెప్పేయండి అని అంటాడు. అప్పుడు ఇమ్మానుయేల్ మేము అసలు ఏ దొంగతనం చేయలేదు సార్ అని అంటాడు. మీరు ఏమి దొంగతనం చేసారో మేమంతా చూసాము సార్, చెప్పకపోతే మాతో పాటు మెయిన్ డోర్ నుండి బయటకి వచ్చేస్తారు సార్ అని అమర్ అంటాడు. ఆ తర్వాత అమర్ దీప్ హౌస్ లోని బెడ్ రూమ్ కి ఒంటరిగా వెళ్లి, కంటెస్టెంట్స్ దాచుకున్న ఆహారాలను మొత్తం చూసి షాక్ కి గురి అవుతాడు. ఆ తర్వాత ఆయన కూడా కొన్ని దొంగతనం చేసి తీసుకెళ్తాడు. చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపిస్తున్న ఈ ప్రోమోని మీరు కూడా చూసేయండి.