Adipurush Video Song: ఆదిపురుష్ విడుదలకు రోజుల సమయం మాత్రమే ఉంది. టీమ్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. గత నెల రోజులుగా వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా జై శ్రీరామ్ అనే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ సీత కోసం రాముడు లంకకు పయనమయ్యే సందర్భంలో వస్తుంది. వానర సైన్యంతో లంకపై సముద్రాన్ని దాటి దండెత్తుతున్న విజువల్స్ పాటలో చూపించారు. ఇక శ్రీరాముడు మా నమ్మకం. ఆయన ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని వానర వీరులు ధైర్యంగా పాడుకునే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది.
వానర సైన్యంలో ధైర్యం నింపుతున్న రాముడు డైలాగ్స్ తో జై శ్రీరామ్ సాంగ్ మొదలవుతుంది. సాంగ్ లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. నేడు విడుదలైన జై శ్రీరామ్ సాంగ్ మెప్పిస్తుంది. ఒక్కో అప్డేట్ ఆదిపురుష్ చిత్రంపై అంచనాలు పెంచేస్తుంది. జై శ్రీరామ్ సాంగ్ ని అజయ్-అతుల్ కంపోజ్ చేశారు. తెలుగు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి అందించారు. సాంగ్ విడుదలైన కాసేపట్లో వైరల్ గా మారింది.
ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. దర్శకుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు. సీతగా కృతి సనన్ నటిస్తుంది. గతంలో ఈమె తెలుగులో వన్ నేనొక్కడినే, దోచేయ్ చిత్రాల్లో నటించింది. చాలా గ్యాప్ అనంతరం ఆదిపురుష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆదిపురుష్ రామాయణ గాథగా తెరకెక్కిన విషయం తెలిసిందే. కెరీర్లో మొదటిసారి ప్రభాస్ పౌరాణిక చిత్రం చేస్తున్నారు.
గత ఏడాది విడుదలైన ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలైంది. విజువల్స్ నాసిరకంగా ఉన్నాయన్నమాట వినిపించింది. ముఖ్యంగా రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్ ని కొందరు తప్పుబట్టారు. ఓమ్ రౌత్ కి అసలు రామాయణం తెలుసా? అని ఎద్దేవా చేశారు. ఆదిపురుష్ చిత్ర విడుదల అడ్డుకుంటామని కొందరు హెచ్చరించారు. దీంతో ఆదిపురుష్ విడుదల ఆరు నెలలు వెనక్కిపోయింది. ట్రైలర్ తో మెప్పించిన ఓమ్ రౌత్ ఫ్యాన్స్ లో ఆశలు చిగురించేలా చేశాడు. ఆదిపురుష్ ఫస్ట్ డే రికార్డు వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుసగా రెండు ప్లాప్స్ ఇచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ తో కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నారు.
