Avatar Fire And Ash Trailer: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించింది…దానికి సీక్వెల్ గా ‘అవతార్ 2’ వచ్చి ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇప్పుడు ‘అవతార్ 3’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మొదటి పార్ట్ లో నేల కు సంబంధించిన స్టోరీ ని చెప్పే ప్రయత్నం చేశారు. రెండో పార్ట్ అండర్ వాటర్ లో తీశారు.
ఇప్పుడు ఈ మూడోవ పార్ట్ ఫైర్ అండ్ ఆష్ ని బేస్ చేసుకొని ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అడవిలో నివసించే ఒక తెగకు చెందిన వాళ్లు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇతరులతో చేసే పోరాటమే ఈ ఫైర్ అండ్ ఆష్ గా తెలుస్తోంది…గత సినిమాలతో విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసిన జేమ్స్ కామెరూన్ మూడో పార్ట్ ను అంతకు మించి తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది… ప్రతి షాట్ ఓ తన ఇంటిలిజెంట్ ని వాడి అందులోని డెప్త్ ను చెప్పే ప్రయత్నం చేశాడు.
ఇక డిటేలింగ్ మీద ఆయన ఎక్కువ వర్క్ చేశాడు. ఆ సీన్స్ ను డీకోడ్ చేస్తే కానీ అందులో ఉన్న డెప్త్ అయితే అర్థం కాదు. ఇక అవతార్ 3 సినిమా నుంచి కొత్త ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే గత రెండు పార్ట్ లకు మించి ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది…
ఇక దానికి తగ్గట్టుగానే గత రెండు పార్టులతో పోల్చుకుంటే ఈ సినిమాలో పేరెంట్స్ చిల్డ్రన్ ఎమోషన్స్ ను చాలా బాగా హైలెట్ చేసి చూపించినట్టుగా తెలుస్తోంది. ఇక విజువల్స్ ని సీజీ సహాయంతో నెక్స్ట్ లెవల్లో చూపించే ప్రయత్నం చేశారు… మ్యూజిక్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ట్రైలర్ లో ప్రతి సౌండ్ చాలా ఫ్రెష్ ఫీల్ తో ఉంది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఒక ట్రాక్ ని వాడారు. అలాగే సస్పెన్స్ గొలిపే సన్నివేశాలకు డిఫరెంట్ సౌండింగ్ ను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు…