https://oktelugu.com/

MAA Elections: కన్నడ సినిమాలో నటిస్తే.. కన్నడ వాళ్ళు మాత్రమే నటించాలన్నాడు ప్రకాష్ రాజ్: పృథ్వి రాజ్ ఆడియో లీక్

MAA Elections: అక్టోబర్ 10వ తేదీ జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి రోజురోజుకు అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలోనే మా ఎన్నికల గురించి రెండు ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా మంచు విష్ణు ప్యానల్ సభ్యుడు అయిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కి సంబంధించిన ఒక ఆడియో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఆడియో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 7, 2021 / 07:17 PM IST
    Follow us on

    MAA Elections: అక్టోబర్ 10వ తేదీ జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి రోజురోజుకు అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలోనే మా ఎన్నికల గురించి రెండు ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా మంచు విష్ణు ప్యానల్ సభ్యుడు అయిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కి సంబంధించిన ఒక ఆడియో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఈ సందర్భంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. ఆయన ప్రకాష్ రాజ్ పై చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే పృథ్వి రాజ్ ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఓ వ్యక్తికి ఫోన్ కాల్ చేశారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఆ వ్యక్తితో మాట్లాడుతూ నాకు వైజాగ్ తో ఎంతో మంచి సంబంధం ఉంది. నా రాజకీయ ప్రస్థానం మొదలైంది వైజాగ్ లోనే. అయితే ఇటీవల మీరు అక్కడ ప్రకాష్ రాజ్ ని సన్మానించడం తనకు ఏమాత్రం నచ్చలేదని ఈ సందర్భంగా పృధ్విరాజ్ మాట్లాడారు.

    ప్రకాష్ రాజ్ కు సన్మానం చేస్తూ ఆయనకు మీరు ఎలా మద్దతు తెలుపుతారని ఈ సందర్భంగా పృధ్విరాజ్ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ స్థానికులు కాకపోయినప్పటికీ అతను ఎన్నికలలో పోటీ చేశారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు కాని పరిపాలించే హక్కు లేదని ఆడియో టేప్ లో ప్రకాష్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయినా ప్రకాష్ రాజ్ క్రమశిక్షణ బాగాలేదని అతనిని రెండుసార్లు మా అసోసియేషన్ బ్యాన్ చేసింది. అలాంటి అతనికి ఎలా మద్దతు తెలుపుతారని మాట్లాడారు. నేను ఓ సమయంలో కన్నడ సినిమాలో నటిస్తుండగా కన్నడ వాళ్ళు మాత్రమే కన్నడ సినిమాలలో నటించాలని ఆయన తనపై కేకలు వేసినట్లు ఈ సందర్భంగా పృధ్విరాజ్ గుర్తుచేశారు. ఏదిఏమైనప్పటికీ తెలుగు వాడిని గెలిపిద్దాం – తెలుగు గౌరవాన్ని కాపాడుదాం అనేదే నా నినాదం అంటూ పృధ్విరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి.