Nagarjuna: గత నాలుగు సీజన్స్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 5 ఘోరంగా విఫలమైందన్న మాట వినిపిస్తుంది. ఈ రియాలిటీ షోపై ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. కారణం షోలో మజా లేకపోవడమే. కాన్సెప్ట్స్ తో పాటు గేమ్స్, టాస్క్స్, అన్నీ గత సీజన్స్ లో ఉన్నవే. అలాగే కంటెస్టెంట్స్ గేమ్ కూడా ఏమంత ఉత్కంఠ కలిగించలేకపోతుంది. వీక్ డేస్ లో బిగ్ బాస్ టీఆర్పీ దారుణంగా ఉంటుందని సమాచారం.
షో చివరి దశకు చేరుకుంటుండగా కనీసం ఇప్పుడైనా పుంజుకోవాలి. కానీ ఆ దాఖలాలేమీ కనిపించడం లేదు. కారణం కంటెస్టెంట్స్ మధ్య పోటీ అంతగా కనిపించడం లేదు. హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉండగా… శ్రీరామ్, సిరి, షణ్ముఖ్ ఒక టీమ్ గా… కాజల్, మానస్, సన్నీ, ప్రియాంక మరొక టీమ్ గా మెదులుతున్నారు. టికెట్ టు ఫినాలే కోసం నిర్వహించిన టాస్క్ లు ఆసక్తికరంగా సాగలేదు. ఇక టికెట్ టు ఫినాలే శ్రీరామ్ గెలిచి నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు.
కాగా కనీసం హోస్ట్ నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ అయినా మెరుగైన టీఆర్పీ రాబడతాయనుకుంటే.. నిరాశే మిగులుతుంది. చివరికు శని, ఆదివారం ఎపిసోడ్స్ లో కూడా పస లేకుండా పోయింది. కంటెస్టెంట్స్ పలుచబడ్డాక మరింతగా షో దిగజారినట్లు అర్థం అవుతుంది. శనివారం ప్రసారమైన ఎపిసోడ్ దీనికి ఉదాహరణ.
Also Read: ఆ కంటెస్టెంట్ గెలుపు కోసం బయట రాజకీయం!
నిన్న నాగార్జున నిర్వహించిన గేమ్స్, టాస్క్ లతో పాటు కంటెస్టెంట్స్ తో జరిపిన సంభాషణ చప్పగా సాగింది. కనీసం వీకెండ్ లో మంచి టీఆర్పీ దక్కుతుందన్న ఆశ కూడా నిర్వాహకులలో పోతుంది. ఈ వీకెండ్ టీఆర్పీ నాగార్జునకు షాక్ ఇచ్చే అవకాశం కలదని అంచనా. బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఉత్కంఠగా నడిపి రికార్డు టీఆర్పీ అందుకున్న నాగార్జునకు, ఈ పరిస్థితి ఊహించనిదే. ఫైనల్ కి రెండు వారాల సమయం మాత్రమే ఉండగా.. షో పుంజుకోవడం కష్టమే అంటున్నారు.
నేడు హౌస్ నుండి ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ట్రాన్స్ జెండర్ ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు సమాచారం లీకైంది. ఈ నేపథ్యంలో మానస్ ని వదిలి వెళ్లలేక ప్రియాంక ఎంత ఆవేదన పడుతుందోనని ఆమె ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో టికెట్ టు ఫీనాలే గెలిచింది అతడే…