Anushka Shetty: టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున హీరో గా నటించిన సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యి..ఆ తర్వాత తెలుగు మరియు తమిళ బాషలలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలం లోనే లేడీ సూపర్ స్టార్ అనే పేరు ని సంపాదించుకున్న నటి అనుష్క..అందంతో పాటు తన అభినయం తో కూడా కోట్లాది మంది యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది..అప్పట్లో ఈమె ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దులు కొట్టి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిలిచింది..కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు..ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అన్ని దాదాపుగా భారీ విజయాలు సాధించిన చిత్రాలే అవ్వడం విశేషం..ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ ని సంపాదించింది అనుష్క శెట్టి..ఇంత క్రేజ్ మరియు ఫాలోయింగ్ సంపాదించినా కూడా ఎప్పుడు డౌన్ టూ ఎర్త్ ఉండడం అనుష్క స్పెషాలిటీ..అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు టచ్ లో ఉండే అనుష్క శెట్టి..తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను ఇది వరుకు చాలాసార్లు షేర్ చేసింది.
ఇక తన సోదరుడు గుణ రంజాన్ శెట్టి పుట్టిన రోజు నాడు ప్రతి ఏడాది వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి..ఇప్పుడు ఆయనకి మాఫియా గ్యాంగ్ నుండి ప్రాణాపాయం ఉందని, తనకి కచ్చితంగా భద్రత కల్పించాలి అని ఆయన రాష్ట్ర హోమ్ మంత్రికి వినతి పత్రం అందచేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..మాఫియా కి అనుష్క శెట్టి సోదరుడికి సంబంధాలు ఏమిటి..అతను ఏమైనా మాఫియా కి లీడర్ గా వ్యవహరిస్తున్నాడు అనే సందేహాలు అనుష్క ఫాన్స్ కి మొదలైనాయి..అసలు విషయానికి వస్తే గతం లో మాఫియా నేరగాడు ముత్తపరై కి కుడి మరియు ఎడమ భుజాలు లాగా మన్విత్ రై మరియు గుణ రంజాన్ శెట్టి (అనుష్క సోదరుడు ) ఉండేవారట..ఆయన మరణించిన తర్వాత మాఫియా గ్యాంగ్ ని మైంటైన్ చేసే విషయం లో మన్విత్ రై మరియు గుణ రంజాన్ శెట్టి మధ్య ఆధిపత్యపోరు జరిగి విడిపొయ్యారట..ఆ సమయం లో గుణ రంజాన్ శెట్టి సొంతం గా జయ కర్ణాటక జానపర అనే వేదికని ఏర్పాటు చేసారు..ఈ వేదిక ద్వారా గుణ రంజాన్ మన్విత్ రై కంటే పాపులారిటీ లోను మరియు సంపాదన పరంగాను ఎవ్వరికి అందనంత ఎత్తు ఎదిగాడు.
ఈ క్రమం లో గుణ రంజాన్ ఎదుగుదల ని తట్టుకోలేక అసూయ తో మన్విత్ రై తన హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తునట్టు తన సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందింది అని..తనకి రక్షణ కల్పించాలని హోమ్ మినిస్టర్ కి వినతి పత్రం రాసినట్టు సమాచారం..ఈ విషయం తెలుసుకున్న మన్విత్ తాను మాఫియా సంబంధిత కార్యక్రమాలకు దూరమై చాలా కాలం అయ్యింది అని..ప్రసుతం నేను విదేశాల్లో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నాను అని..గుణ రంజాన్ కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు మన్విత్ ..వీళ్లిద్దరి మధ్య జరుగుతున్నా సంఘటనలు చూస్తూంతే మనకి మంచి గ్యాంగ్ స్టర్ సినిమాని చూసినట్టు అనిపిస్తుంది కదూ..అనుష్క వెనుక ఇంతతి మాఫియా బ్యాక్ గ్రౌండ్ ఉందా అని ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.