Homeజాతీయ వార్తలుLand Expatriates: బంగారు తెలంగాణలో నిర్వాసితుల పరిస్థితిదీ

Land Expatriates: బంగారు తెలంగాణలో నిర్వాసితుల పరిస్థితిదీ

Land Expatriates: చాట్ల తవుడు పోసి కుక్కలను ఎగదోస్తే ఎలా ఉంటుంది? రెండు కండ్లు మనవే అయినా ఒక కంటిని ఒకలా, ఇంకో కంటిని మరోలా చూస్తే ఎలా ఉంటుంది? అచ్చం తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులా ఉంటుంది. మల్లన్న సాగర్ లో మునిగే భూములకు ఒక తీరుగా, మీద ప్రాజెక్టుల పరిధిలో మునిగే భూములకు మరొకలా పరిహారం ఇస్తుండడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. మొన్న మామిళ్ళ గూడెం, నిన్న గౌరవెళ్లి, మరి రేపు..ఈ ఘటనలకు ముమ్మాటికీ సర్కారే తీరే కారణం.

Land Expatriates
husnabad Land Expatriates

కోటి ఎకరాల మాగాణ సరే మరి పరిహారమో

మాట మాట్లాడితే కో టి ఎకరాల మాగాణి నా కల.. బంగారు తెలంగాణ నిర్మాణం నా చిరకాల వాంఛ అని కెసిఆర్ పదేపదే చెబుతూ ఉంటాడు. కానీ ఈ కోటి ఎకరాల మాగాణి పరిచే ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులను మాత్రం పట్టించుకోడు. సొంత జిల్లాలో మల్లన్నసాగర్ బాధితులైనా, ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ నిర్వాసితులైనా, గౌరవెల్లి లో మునిగే బీద రైతు లైనా, డిండి లో సర్వం కోల్పోయే నల్లగొండ రైతులు అయినా ఆయనకు పట్టదు. మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం ఇవ్వాలంటే ఆయనకు నచ్చదు. సభలు సమావేశాల్లో మాత్రం తెలంగాణలో ఎకరా భూమి 25 లక్షల నుంచి 30 లక్షలు పలుకుతోంది అని గప్పాలు కొడుతుంటాడు. భూమి పోతుంది దొరా. పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకో అంటే లాఠీ దెబ్బల రుచి చూపిస్తాడు.

Also Read: Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

గౌరవెల్లి ఇప్పటిది కాదు

హుస్నాబాద్ పరిధిలో నిర్మించే గౌరవెల్లి ప్రాజెక్ట్ గొడవ ఇప్పటిది కాదు. ఇప్పటి తో ముగిసేది కాదు. మెరుగైన పరిహారం కోసం అక్కడి రైతులు చేయని నిరసన అంటూ లేదు. ప్రభుత్వానికి, ఎదురైన అధికారికి, కనిపించిన ప్రజాప్రతినిధికి మొరపెట్టుకున్న వారి గోడు వినే వారు కరువయ్యారు. అసలే రైతులు, ఆ పైన ఉన్నది కొద్దిపాటి భూమి.. అండగా ఉండాల్సిన ప్రభుత్వం పోలీసుల్ని ఎగదోసి చెదరగొట్టింది. లాఠీలకు ఝళిపించింది. రైతుల తలలు పగిలాయి. మహిళల చేతులు విరిగాయి. అయినా కనీసం ప్రభుత్వం నుంచి ఒక పరామర్శ కూడా రైతులకు రాలేదు.

Land Expatriates
Land Expatriates

సీతారామ ది ఇదే దుస్థితి

భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు కి మరో దుస్థితి. ఇక్కడ గోదావరి నీటి లభ్యత ఆధారంగా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డుకు ఇంతవరకు తెలపలేదు. పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు చెప్పకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. మొదట్లో 2010 ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పి ఎకరాకు 5 లక్షల చొప్పున రైతులకు చెక్కులు ఇచ్చారు. అదే మల్లన్న సాగర్ ముంపు రైతులకు 2012 చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారు. దీన్ని కొంత మంది రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఇక్కడి రైతులు గత రెండు వందల ఎనభై ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ దాకా సంఘీభావం తెలిపిన రైతులకు ఒక్క పైసా కూడా పరిహారం రాలేదు. పైగా నిరాహార దీక్ష శిబిరంలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు వేసిన కేసు పై హైకోర్టు స్టే విధించింది. మరోవైపు ఆ భూములలో ఎటువంటి సాగు చేపట్టవద్దని ఆదేశించింది. దీంతో ఆశిక్ చిన్న సన్నకారు రైతులకు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్తున్నారు.

డిండిది మరో ఘోరం

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు రక్షి త మంచి నీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి మార్గదర్శనం కరువైంది. ఈ ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌ను ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఖరారు చేసినా, దీనికి ఇంతవరకూ ప్రభుత్వ ఆమోదం దక్కలేదు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్‌ నుంచి కాకుం డా ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకునేందుకు ఇప్పటికే నీటి పారుదల శాఖ ఓకే చెప్పినా, ప్రభుత్వం ఇంకా నాన్చుతుండటంతో ఎటూ తేలడంలేదు. ఇక ఇప్పటికే మొదలైన రిజర్వాయర్ల పరిధిలోనూ భూసేకరణ, సహాయ పునరావాస పనుల్లో అనేక అవాంతరాలున్నా వాటిని పట్టించుకొని పరిష్కరించేవారే కరువయ్యారు.

ఎప్పుడు ముందుకు

శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగిస్తూ, నాగర్‌ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లోని 7 నియోజకవర్గాలు, 21 మండలాల పరిధిలోని 3.61 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేలా రూ.6,190 కోట్లతో డిండి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు 2015 జూన్‌ 11న సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అయి తే మొదట ఈ ప్రాజెక్టుకు పాలమూరు ఎత్తిపోతల్లోని రెండో రిజర్వాయర్‌ ఏదుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ నీటిని 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది. అనంతరం తిరిగి పాలమూరు ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్‌ నార్లాపూర్‌ నుంచే తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ ప్రతిపాదనలతో భూసేకరణ అవసరాలు ఎక్కువగా ఉండటం, అటవీ భూముల ముంపు సైతం ఉండటంతో తిరిగి ఏదుల నుంచే తీసుకోవాలని ఇటీవలే తుది నిర్ణయం తీసుకున్నారు. ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్‌ చానల్, తర్వాత 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్‌ చానల్, అటునుంచి తిరిగి 16 కిలోమీటర్ల మేర టన్నెల్‌ ద్వారా నీరు ప్రవహిస్తుంది. తర్వాత మళ్లీ 3 కిలోమీటర్ల మేర ఓపెన్‌ చానల్‌లో ప్రవహించి, సహజ సిద్ధ వాగులో కలసి, కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. అటు నుంచి డిండికి నీటిని చేరుస్తారు.

Land Expatriates
Sitarama project Land Expatriates

ఈ ప్రతిపాదనకు రూ.1,293.55 కోట్లు అవు తుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను జనవరిలోనే ప్రభుత్వ అనుమతికై పంపినా ఇంతవరకు అనుమతులివ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని సమీక్షించి ఓకే చెబితే కానీ దీనికి అనుమతులు వచ్చేలా కనిపించడం లేదు. అనుమతులు వస్తే కానీ టెండర్లు పిలిచి పనులు చేపట్టడం సాధ్యం కాదు.

నిధులు ఎక్కడివి?

భూసేకరణ నిధులకూ తంటాలు..
ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌ ఖరారు కానుందున, అంతలోగా నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి (0.8టీఎంసీ), గొట్టిముక్కల (1.8 టీఎంసీ), చింతపల్లి (0.99 టీఎంసీ), కిష్ట రాంపల్లి(5.68 టీఎంసీ), శివన్నగూడం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు వాటికి అనుబంధంగా మెయిన్‌ కెనాల్‌ పనులను ప్రభుత్వం రూ.3,929 కోట్లతో చేపట్టింది. వీటిలో ప్రధాన పనులు ఇప్ప టికే ఆరంభమయ్యాయి. ఈ రిజర్వాయర్ల కింద 16,135 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8 వేల ఎకరాల మేర పూర్తి చేశారు. మరో 8 వేల ఎకరాలు ఎక్కడికక్కడే ఉంది.

ఇక్కడ సేకరించిన భూములకు సం బంధించి రూ.181 కోట్ల మేర ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో కొత్తగా భూ ములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అదీగాక కాళేశ్వరంలోని మల్లన్నసాగర్‌ రైతులకు ఇచ్చిన మాదిరే పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కిష్టరాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్‌ పరిధిలోని ముంపు గ్రామాలు ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా ఎక్కువ పరిహారం కోరుతున్నా యి. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపితేనే ప్రాజెక్టులో కదలిక వస్తుంది.

Also Read:BJP Targeted Southern States: దేశ రాజకీయం దక్షిణాది వైపు ఎందుకు చూస్తోంది? తెలంగాణలో బీజేపీ కొత్త ప్లాన్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version