Pushpa 2 Producers: నేడు ఉదయం తెల్లవారుజామున ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజుపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన ఘటన తెలుగు సినీ ఇండస్ట్రీ లో సంచలనం గా మారింది. అకస్మాత్తుగా ఈ తనీఖులు ఏమిటి,అసలు ఏమి జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఘటన జరిగిన కాసేపటికి పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఎర్నేని & సీఈఓ చెర్రీ లపై కూడా ఐటీ దాడులు నిర్వహించారు. పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది నిర్మాతలు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమా లెక్కపత్రాలు కూడా అడిగినట్టు తెలుస్తుంది. కేవలం వీళ్లిద్దరి మీద మాత్రమే కాదు ‘దేవర’ చిత్రానికి ఫైనాన్స్ అందించిన రంగయ్య, అదే విధంగా అభిషేక్ అగర్వాల్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈమధ్య కాలం లో నిర్మాతలు కలెక్షన్స్ ని అభిమానుల కోసం బహిర్గతం చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టర్స్ ద్వారా తమ సినిమాలకు వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని పబ్లిసిటీ చేస్తున్నారు. వచ్చిన కలెక్షన్స్ ని వేసుకుంటే పర్వాలేదు, కానీ వచ్చిన దానికంటే అదనంగా వసూళ్లను వేసుకొని ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు నిర్మాతలకు ఇలా తిప్పి కొట్టింది. ఒకప్పుడు తమ సినిమాలకు వచ్చే వసూళ్లను బహిర్గతం చేసేందుకు అసలు ఇష్టపడే వారు కాదు దర్శక నిర్మాతలు. వ్యాపారాల్లో వచ్చే లాభాలను ఎవరైనా బయట వాళ్లకు చూపిస్తారా అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా చూపించి వ్యాపారం చేసుకోవడం కొత్త ట్రెండ్ అయిపోయింది. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం మొదటి ఆట నుండే ఎలాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకుందో మనమంతా చూసాము. అయితే ఈ సినిమాకి మొదటి రోజు నిర్మాతలు వేసిన పోస్టర్ ని చూసి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. సినిమాకి అంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చింది, ఆ టాక్ మీద ఇంత వసూళ్లు ఎలా సాధ్యం అంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. దిల్ రాజు పై ఐటీ అధికారులు రైడింగ్స్ చేయడానికి ఈ పోస్టర్ కూడా ఒక కారణం అని అంటున్నారు. అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి వారం రోజుల ముందే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని కూడా పోస్టర్స్ ద్వారా ప్రకటించారు. అదే విధంగా పుష్ప 2 చిత్రం దేశం లోనే ఇండస్ట్రీ హిట్ అని, 1860 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని పోస్టర్లు విడుదల చేశారు. అందుకే వాళ్లపై కూడా రైడింగ్ జరిగింది.