https://oktelugu.com/

‘అట్లీ – షారుఖ్’ సినిమాకి రంగం సిద్ధం !

‘రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్’ ఇలా తీసిన ప్రతి సినిమా సూపర్ హిటే. అందుకే, తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఓ దశలో ఎన్టీఆర్ కూడా స్వయంగా అట్లీకి ఫోన్ చేసి, మనం కలిసి ఓ సినిమా చేద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడంటనే అట్లీ రేంజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ జనరేషన్ లో ఇంత తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చిన యుంగ్ డైరెక్టర్స్ లో అట్లీ […]

Written By:
  • admin
  • , Updated On : May 26, 2021 / 08:31 AM IST
    Follow us on

    ‘రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్’ ఇలా తీసిన ప్రతి సినిమా సూపర్ హిటే. అందుకే, తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఓ దశలో ఎన్టీఆర్ కూడా స్వయంగా అట్లీకి ఫోన్ చేసి, మనం కలిసి ఓ సినిమా చేద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడంటనే అట్లీ రేంజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

    ఈ జనరేషన్ లో ఇంత తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చిన యుంగ్ డైరెక్టర్స్ లో అట్లీ తప్ప, మరొకరు లేరు. అందుకే అట్లీ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా వెర్రి అభిమానం చూపిస్తున్నారు. అందుకే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా అట్లీతో సినిమా చేయాలని ఆశ పడ్డాడు. అట్లీ కోసం ఏకంగా ఎనిమిది నెలలు వెయిట్ చేశాడు. ఇక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు కరోనా వచ్చింది.

    కరోనా రాకతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. కానీ అట్లీ మాత్రం షారుఖ్ కోసం ఓ పవర్ ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. ఎంతైనా ఎంతో క్రేజున్న డైరెక్టర్ కావడంతో.. ఇప్పుడు బాలీవుడ్ లో అందరూ షారుఖ్ – అట్లీ ప్రాజెక్ట్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ లాక్ డౌన్ కొనసాగడంతో ఈ ప్రాజెక్ట్ లేట్ అయినా సబ్జెక్టు మాత్రం రెడీ అయిపోయింది.

    షారూక్ ప్రస్తుతం ‘పఠాన్’ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరో రెండు నెలల్లో పూర్తి కానుంది. అందుకే ఆగస్టు నుంచి అట్లీ – షారుఖ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే షారుక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బాలీవుడ్ మీడియా కూడా క్లారిటీ ఇస్తోంది. భారీ సినిమా కాబట్టి, ఈ సినిమా కోసం అట్లీ మరో ఏడాది ఈ సినిమా మీదే కూర్చోనున్నాడు.