Athidhi Devo Bhava : ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘అతిధి దేవోభవ’. అయితే, రిలీజ్ అయిన మొదటి షో నుంచి ఈ సినిమాకి విపరీతమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ అయితే, అతి దారుణంగా వచ్చాయి. కొన్ని థియేటర్స్ లో అయితే సింగిల్ టికెట్ కూడా తెగ లేదు. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో ప్లాప్ అయిన సినిమా మరొకటి లేదు.

ఆ స్థాయిలో బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా ఫుల్ క్రెడిట్ ను కొట్టేసింది ఈ ‘అతిధి దేవోభవ’ చిత్రం. ఆది సాయి కుమార్ ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. కనీసం ఏవరేజ్ టాక్ వచ్చినా.. తనకు కొంచెం మార్కెట్ అయినా బిల్డ్ అవుతుందని ఆది చాలా ఆశ పడ్డాడు. అయితే, ఈ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు.
అసలు ఊరు పేరు లేని హీరోకి కూడా మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది ఆది సాయి కుమార్ కి మాత్రం అస్సలు కలెక్షన్స్ రాకపోవడం నిజంగా విచిత్రమే. ఒక విధంగా ఈ మధ్య కాలంలో ఆది సాయి కుమార్ హీరోగా చేసిన సినిమాల్లోనే ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం అనే ఆలోచన కూడా మనం చేయడం పెద్ద బూతు అయిపోతుంది, కాబట్టి.. ఇంతటితో విరమిద్దాం.
ఇక ఈ అతి పెద్ద డిజాస్టర్ కి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్లను చూద్దాం.
నైజాం 0.08 కోట్లు
సీడెడ్ 0.03 కోట్లు
ఆంధ్రా : 0.06 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 0.17 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.01 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.18 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
Also Read: Rajamouli: రాజమౌళి ఫ్రిజ్ లో ఈగలు.. స్టోరీని రివీల్ చేసిన చెర్రీ, తారక్..!
అన్నట్టు ఈ ‘అతిథి దేవో భవ’ సినిమానికి రూ.1.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. పాపం బయ్యర్లు ఫుల్ గా బుక్ అయ్యారు. పొలిమేర నాగేశ్వర్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో మిర్యాల రాజాబాబు, అశోక్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. నిర్మాతలు కూడా ఈ సినిమాతో భారీగానే నష్టపోయారు.
Also Read: Sunita: ‘రామ్’పై మనసులోని మాటను బయటపెట్టిన సునీత..!