Atithi Devo Bhava Telugu Movie Review: నటీనటులు: ఆది సాయి కుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి తదితరులు
దర్శకత్వం: పొలిమేర నాగేశ్వ
సినిమాటోగ్రఫీ: అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
కథ: వేణుగోపాల్ రెడ్డి
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల

Atithi Devo Bhava Telugu Movie Review
పొలిమేర నాగేశ్వర్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌గా వచ్చిన చిత్రం ‘అతిధి దేవోభవ’. మిర్యాల రాజాబాబు, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ:
అభయ్ (ఆది సాయి కుమార్) కి మోనో ఫోబియా అనే ఓ మానసిక వ్యాధి ఉంటుంది. క్లుప్తంగా చెప్పుకుంటే ఆ వ్యాధి కారణంగా అతను ఒంటరితనాన్ని భరించలేడు. చనిపోతాడు. మరి, అలాంటి అభయ్ కి ప్రేమ అవసరమా ? కానీ, వైష్ణవి (నువేక్ష) ని ప్రేమించాడు. ప్రతి క్షణం మరో మనిషి తోడు లేకపోతే బతకలేడు అని తెలియక, వైష్ణవి కూడా అభయ్ ని ప్రేమించింది. మరి ఈ మోనో ఫోబియా ప్రేమ కథలో వచ్చిన సమస్య ఏమిటి ? అభయ్ సమస్య వైష్ణవికి తెలిసిందా ? లేదా ? అసలు అతని సమస్య విని వైష్ణవి ఎలా రియాక్ట్ అయ్యింది ? అనేది మిగతా బాగోతం.
Also Read: `ఇందువదన` రివ్యూ
విశ్లేషణ :
క్యారెక్టరైజేషన్ మాడ్యులేషన్ తప్ప, ఎమోషన్ లేని పాత్రలో ఆది సాయికుమార్ కనిపించాడు. కానీ సినిమా మొత్తం ఆది ఎమోషనల్ గానే ఉంటాడు. కాకపోతే, ఆ ఎమోషన్ మనకు ఇరిటేషన్ అనుకోండి. ఇక ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అన్నిటికి మించి చిన్న పాయింట్ చుట్టే పూర్తి కథను నడిపితే ఇంట్రెస్ట్ ఏముంటుంది ?
పైగా కథలో ఎక్కడ టర్నింగ్ పాయింట్లు కూడా లేవు. దీనికి తోడు బలమైన సంఘర్షణ కూడా లేదు. ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా ఈ సినిమాకు మైనస్ అయ్యాడు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం సినిమాకి అతి పెద్ద బలం. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్ :
మెయిన్ థీమ్,
కొన్ని లవ్ సీన్స్,
నేపథ్య సంగీతం,
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ స్క్రీన్ ప్లే,
రొటీన్ లవ్ ఎమోషనల్ డ్రామా,
హీరో – హీరోయిన్ ట్రాక్,
లాజిక్స్ లేని సీన్స్,
బోరింగ్ ట్రీట్మెంట్,
Also Read: రివ్యూ : “అర్జున ఫల్గుణ” !
సినిమా చూడాలా ? వద్దా ?
‘మోనో ఫోబియా’తో వచ్చిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ బాగా రొటీన్ గా స్లోగా సాగుతుంది. అలాగే వెరీ రెగ్యులర్ వ్యవహారాలతో బాగా బోర్ కొట్టించింది . మొత్తమ్మీద ఈ ‘అతిథి దేవోభవ’లో అతిథికి విలువ లేకుండా పోయింది. కాబట్టి ఈ సినిమా చూడక్కర్లేదు.
రేటింగ్ : 1.75 / 5