Athadu 4K Re Release: మహేష్ బాబు కెరీర్ బెస్ట్ మూవీస్ లో అతడు ఒకటి అనడంలో సందేహం లేదు. అతడు రీరిలీజ్ నేపథ్యంలో నిర్మాత మురళీ మోహన్ మీడియా ముందుకు వచ్చారు. అతడు 2 చేస్తే ఎవరితో చేస్తారో వెల్లడించారు.
2005లో విడుదలైన అతడు(ATHADU) థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. కానీ అతడు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావలసిన అంశాలు అతడు చిత్రంలో ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాన్స్ సమపాళ్లలో మేళవించి అతడు చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించారు. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ సినిమాకే హైలెట్. మహేష్ బాబు(MAHESH BABU) క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుంది. మణిశర్మ సాంగ్స్ మరో ఆకర్షణ.
అయితే అతడు బుల్లితెరపై సంచలనాలు చేసింది. అతడు విడుదలై రెండు దశాబ్దాలు అవుతుండగా వందల సార్లు టెలివిజన్ లో ప్రసారమైంది. ప్రసారమైన ప్రతిసారి అతడు మంచి టీఆర్పీ అందుకుంది. చెప్పాలంటే బుల్లితెర ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ మూవీ అతడు. అంతగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రెండు మూడేళ్ళుగా అతడు రీ రిలీజ్ చేయాలని ఆ చిత్ర నిర్మాత మురళీ మోహన్ ని ఫ్యాన్స్ అభ్యర్థిస్తున్నారు. ఎట్టకేలకు మురళీ మోహన్ ముందుకు వచ్చారు.
అతడు చిత్రాన్ని ఆగస్టు 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత మురళీ మోహన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. థియేటర్స్ లో ఈ సినిమాను ఎక్కువ మంది చూడలేదు. టెలివిజన్ లో మాత్రం చూసి ఎంజాయ్ చేశారని ఆయన అన్నారు. అతడు క్లైమాక్స్ చూసిన సెన్సార్ సభ్యుడు మురళీ మోహన్ కి ఫోన్ చేశారట. హాలీవుడ్ రేంజ్ లో క్లైమాక్స్ ఫైట్ ఉంది. తెలుగులో ఈ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ గతంలో రాలేదని అన్నారట.
రాజకీయంగా, వ్యాపారాల్లో బిజీ కావడం వలన అతడు చిత్రం తర్వాత జయభేరి బ్యానర్ లో చిత్రం చేయలేదని ఆయన వెల్లడించారు. ఇక అతడు 2 చేయాల్సి వస్తే… ఎవరితో చేస్తారని అడగ్గా…. అతడు 2 చేయాల్సి వస్తే మహేష్ బాబు, త్రివిక్రమ్ లతోనే చేస్తాను. వారు కాకుండా మరొకరిని ప్రేక్షకులు అంగీకరించరు. వారిద్దరూ డేట్స్ ఇస్తే అతడు 2 చేయడానికి రెడీ.. అని మురళీ మోహన్ అన్నారు. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు SSMB 29 చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయన అతడు 2 చేసే అవకాశం లేకపోలేదని మురళీ మోహన్ వ్యాఖ్యలతో స్పష్టం అవుతుంది.