Athadu Movie Re-release : నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) 50 వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా మహేష్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘అతడు'(Athadu Movie) చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎలా వచ్చింది అనేది కాసేపు పక్కన పెడితే, ప్రతీ సెంటర్ లోనూ మహేష్ అభిమానులు తారాస్థాయిలో సంబరాలు చేసుకున్నారు. కొత్త సినిమాకు ప్రీమియర్ షోస్ పడినట్టుగా, ఈ సినిమాకు కూడా విడుదలకు ముందు రోజు రాత్రి పలు చోట్ల ప్రీమియర్ షోస్ వేశారు. దానానికి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అయితే హైదరాబాద్ లోని విశ్వనాథ్ థియేటర్ లో మాత్రం నిన్న పెద్ద గొడవే జరిగింది. అది కూడా అసలు ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మాజీ సీఎం జగన్ ఫ్యాన్స్ మధ్యలో ఈ గొడవ జరగడం విశేషం. ఇంతకీ అసలు గొడవేంటి?, ఈ రెండు గ్రూపులు అక్కడికి ఎందుకు వచ్చాయి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము.
వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ఏ పార్టీ కి చెందిన హీరో కాదు కాబట్టి, ఆయన్ని ఇతర పార్టీల నుండి అభిమానించే వారు రెండు గ్రూప్స్ గా ఏర్పడి నిన్న విశ్వనాథ్ థియేటర్ కి వచ్చారు. వైసీపీ పార్టీ నుండి ఒక గ్రూప్, అదే విధంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) జనసేన పార్టీ నుండి మరో గ్రూప్. వైసీపీ పార్టీ కి సంబంధించిన గ్రూప్ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, అదే విధంగా జనసేన పార్టీ కి సంబంధించిన వారు జగన్(Ex CM Jagan) కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. కాసేపు థియేటర్ మొత్తం గందరగోళం వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు వచ్చి పరిస్థితి ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మీరు కూడా క్రింద చూడొచ్చు.
అయితే ఈ గొడవ పై సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇస్తూ, మా సినిమాకు వచ్చి ఇక్కడ మీ గోల ఏంటి?, మీ గొడవ బయట ఎక్కడైనా చూసుకోండి, మా మహేష్ బాబు కి ఏ పార్టీ తో సంబంధం లేదు. మీకు అభిమానం ఉంటే సైలెంట్ గా వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి, అంతే కానీ మీ పార్టీల జెండాలు మా థియేటర్స్ కి తీసుకొని రావొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహేష్ ఫ్యాన్స్. గతం లో కూడా ఒక జగన్ అభిమాని మహేష్ బాబు రీ రిలీజ్ మూవీ కి వచ్చి జై జగన్ అని అరిచినందుకు అక్కడి ఫ్యాన్స్ చితక్కొట్టి పంపించారు. మళ్ళీ అలాంటి ఘటనలు రిపీట్ అవుతాయి అంటూ మహేష్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.
Jagan Gadu bokka#Athadu4K pic.twitter.com/wvkiulaNpS https://t.co/b6AtVRnr5C
— ᵖˢᵖᵏ ₲ (@USTHAAD_PK_CULT) August 8, 2025