Athadu4k 2025 Premieres: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) అభిమానులకు మాత్రమే కాదు, టాలీవుడ్ లో మూవీ లవర్స్ అందరికీ ఎంతో ఇష్టమైన చిత్రం ‘అతడు'(Athadu 4k). ఆరోజుల్లో ఈ సినిమాకు థియేటర్స్ లో ఆదరణ పెద్దగా దొరకలేదు కానీ, టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ సినిమా ఒక ప్రభంజనమే సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో వస్తే పనులు మానుకొని మరీ చూసేవాళ్ళు ఉన్నారు. త్రివిక్రమ్(Trivikram Srinivas) మేకింగ్ స్టైల్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, మహేష్ బాబు నటన, ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఫ్రేమ్ చేయబడిన సినిమా ఇది. అలాంటి క్లాసిక్ చిత్రాన్ని మరోసారి థియేటర్స్ లోకి తీసుకొస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతుందని అంతా అనుకునేవారు. మహేష్ అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని 4K కి మార్చి గ్రాండ్ గా ఈ నెల 9 న మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు.
ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ చిత్రాన్ని IMAX ఫార్మటు లోకి మార్చారు. ఒక రీ రిలీజ్ చిత్రాన్ని IMAX వెర్షన్ లోకి మార్చడం ఈ చిత్రానికే మొట్టమొదటిసారి జరిగింది. అయితే ఇంత చేసినా కూడా ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. సాధారణంగా హైదరాబాద్ లో ఐమాక్ PCX స్క్రీన్ లో రీ రిలీజ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ సినిమా అలాంటి స్క్రీన్స్ కోసమే తయారు చేయించారు. కానీ ఆ స్క్రీన్ లోనే ఇప్పటి వరకు ఒక్క షో కూడా హౌస్ ఫుల్ పడలేదు. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద షాక్ అనుకోవచ్చు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా కోటి రూపాయిల గ్రాస్ ని కూడా దాటలేదు. ఖలేజా చిత్రానికి బుకింగ్స్ ప్రారంభించిన గంటలోనే కేవలం హైదరాబాద్ నుండి కోటి గ్రాస్ వచ్చింది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు వసూళ్లను కొట్టడం అసాధ్యం. హైదరాబాద్ లో అయిన ఒక మోస్తారు గా ఉంది కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం టికెట్స్ అసలు కదలడం లేదు. చూస్తుంటే ఆగష్టు 14 న రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతుండడం తో, ఆ సినిమాల ప్రభావం దీని మీద పడి ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ అంచనాలు ఒకప్పుడు ఈ సినిమా మీద ఎలా ఉండేది అంటే, రీ రిలీజ్ లో కచ్చితంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వస్తుంది అనే రేంజ్ ధీమాతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి ఉన్న ఫ్లో ని చూసి వాళ్లకు నోటి నుండి మాట రావడం లేదు.