Devara Movie Box office  Collection : బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ ఊచకోత..3వ రోజు వసూళ్లు మొదటి రోజునే మించిపోయాయి..ఎంత వచ్చాయంటే!

చిత్రంతో ఎన్టీఆర్ ఓపెనింగ్స్ లో ఎంత స్ట్రాంగ్ అనే విషయం మరోసారి అందరికీ అర్థం అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిడ్ నైట్ షోస్ నుండే ప్రారంభం అయ్యింది. ఆ షోస్ నుండి డివైడ్ టాక్ ని తెచ్చుకున్న 'దేవర'  మొదటి రోజు ముగిసేసరికి ఎబోవ్ యావరేజి టాక్ కి స్థిరపడింది. చాలా కాలం నుండి పెద్ద హీరోల సినిమాలు విడుదల అవ్వడం లేదు. కల్కి తర్వాత మన టాలీవుడ్ లో విడుదలైన చిత్రాలన్నీ చిన్న సినిమాలే.

Written By: Vicky, Updated On : September 29, 2024 7:28 pm

Devar Movie Box office  Collection

Follow us on

Devara Movie Box office  Collection :  ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు ఎలాంటి ఓపెనింగ్ ని దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ కొట్టిన డైరెక్టర్ తో సినిమా తీసి మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం చిన్న విషయం కాదు. అది ఎన్టీఆర్ కి తప్ప టాలీవుడ్ లో మరో హీరోకి భవిష్యత్తులో సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ, ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఓపెనింగ్స్ లో ఎంత స్ట్రాంగ్ అనే విషయం మరోసారి అందరికీ అర్థం అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిడ్ నైట్ షోస్ నుండే ప్రారంభం అయ్యింది. ఆ షోస్ నుండి డివైడ్ టాక్ ని తెచ్చుకున్న ‘దేవర’  మొదటి రోజు ముగిసేసరికి ఎబోవ్ యావరేజి టాక్ కి స్థిరపడింది. చాలా కాలం నుండి పెద్ద హీరోల సినిమాలు విడుదల అవ్వడం లేదు. కల్కి తర్వాత మన టాలీవుడ్ లో విడుదలైన చిత్రాలన్నీ చిన్న సినిమాలే.

అందుకే ఆడియన్స్ ‘దేవర’ కి మొదటి వీకెండ్ లో బ్రహ్మరధం పట్టారు. మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ సినిమాకి రెండవ రోజు అనుకున్న రేంజ్ వసూళ్లు రాలేదు. అనేక ప్రాంతాల్లో మార్నింగ్ షోస్ చాలా డల్ గా మొదలయ్యాయి. దీంతో ట్రేడ్ పండితులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. రాయలసీమ ప్రాంతంలో మంచి వసూళ్లు వచ్చినప్పటికీ, కోస్తాంధ్ర లో బాగా తగ్గాయి. నైజాం ప్రాంతంలో కూడా అంతంత మాత్రంగానే వసూళ్లు వచ్చాయి. కానీ మూడవ రోజు మాత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో మార్నింగ్ షోస్ నుండే బలంగా ప్రారంభం అయ్యాయి. మ్యాట్నీ షోస్ నుండి అయితే అనేక ప్రాంతాలలో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ట్రేడ్ పండితులు అందిస్తున్న ముందస్తు సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొదటి రోజు 54 కోట్లు, రెండవ రోజు 14 కోట్లు, మూడవ రోజు 16 కోట్లు, మొత్తం మీద మూడు రోజులకు కలిపి 84 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 110 కోట్ల రూపాయలకు జరిగింది.  మామూలు పని దినాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటే, ఈ చిత్రం వచ్చే వీకెండ్ కి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని ఎన్టీఆర్ కెరీర్ లో క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ పనిదినాల్లో ఈ చిత్రం క్రాష్ అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం దాదాపుగా అసాధ్యమే, మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.