Ashwini Dutt : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి యంగ్ హీరోగా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న నటుడు మాత్రం తేజ సజ్జ కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. హనుమాన్, మిరాయి లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో లో పాల్గొన్న తేజ ఆ షోలో జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే అశ్వినిదత్ నీకు 6 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిగా ఆ మ్యాటర్ ఏంటి అని జగపతిబాబు అడగడంతో తేజ అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక తేజ మాట్లాడుతూ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రొడ్యూసర్ అశ్వినీదత్ గారే కావడం విశేషం…చూడాలని ఉంది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్నారు. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఆ తర్వాత నేను రాజకుమారుడు, ఇంద్ర లాంటి సినిమాలు కూడా చేశాను. వరుసగా వాళ్ల బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాను కాబట్టి నా పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లో ఐదు లక్షల రూపాయలను వేస్తానని అశ్విని దత్ చెప్పారు. తేజ కి 25 సంవత్సరాల వచ్చిన తర్వాత తీసుకుంటే వాడికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తుందని చెప్పాడట…
ఇక తేజ ఈ విషయాన్ని కంటిన్యు చేస్తూనే నాకు 25 సంవత్సరాలు దాటి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఎలాంటి అమౌంట్ అయితే రాలేదని చెప్పాడు. మరి ఇప్పుడు ఇవ్వమంటావా అని జగపతిబాబు అడిగితే అశ్విని దత్ వల్ల కూతురు అయిన స్వప్న దత్ గారిని ఉద్దేశించి అక్క ఆ డబ్బులు ఇవ్వకపోయిన పర్లేదు ఒక మంచి కథను నా దగ్గరికి తీసుకొస్తే చాలని తేజ సజ్జ చెప్పాడు.
మొత్తానికైతే తేజ సజ్జ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత అశ్వినీదత్ గారికే దక్కుతోంది. తేజ అప్పటినుంచి ఇప్పటివరకు తన టాలెంట్ తో సక్సెస్ లను అందుకుంటూ అదరగొడుతున్నాడు…ఇక మీదట కూడా ఆయన మంచి సినిమాలు చేస్తూ టైర్ వన్ హీరోగా మారితే చూడాలని తన అభిమానులు కోరుకుంటున్నారు…