Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఎపిసోడ్ హైలెట్స్: రతిక ఇంటికి, అడ్డంగా బుక్కైన పల్లవి ప్రశాంత్!

స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ గా విడదీసి గేమ్స్ ఆడించారు. చివరికి స్పై బ్యాచ్ గెలిచింది. ఒక పక్క ఎలిమినేషన్ ప్రక్రియ నడుస్తూ వచ్చింది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు.

Written By: NARESH, Updated On : November 27, 2023 10:08 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో ఈ వీకెండ్ ఉత్కంఠగా సాగింది. డబుల్ ఎలిమినేషన్ నేపథ్యంలో ఏ ఇద్దరు వెళ్ళిపోతారనే చర్చ జోరుగా నడిచింది. శనివారం అశ్విని శ్రీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. శివాజీ, ప్రశాంత్, అర్జున్, అమర్, గౌతమ్, రతిక, అశ్విని, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరి నుండి అశ్విని ఎలిమినేట్ అయ్యింది. ఇక ఆదివారం నాగార్జున ఫన్నీగా షో స్టార్ట్ చేశారు. పలు రకాల గేమ్ ఆడించాడు.

స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ గా విడదీసి గేమ్స్ ఆడించారు. చివరికి స్పై బ్యాచ్ గెలిచింది. ఒక పక్క ఎలిమినేషన్ ప్రక్రియ నడుస్తూ వచ్చింది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. చివరికి అర్జున్-అశ్విని మిగిలారు. పల్లవి ప్రశాంత్ వద్ద అవిక్షన్ పాస్ ఉన్న నేపథ్యంలో వాడి ఒకరిని కాపాడొచ్చని నాగార్జున అన్నాడు. అయితే దాన్ని 14వ వారమే వాడతానని ప్రశాంత్ చెప్పాడు. కీలక సమయంలో రతికకు హ్యాండ్ ఇచ్చాడు.

ప్రింటర్ నుండి ఎవరి ఫోటో వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. రతిక ఫోటో రాగా ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పాడు. రతిక ఇంటిని వీడి వేదిక మీదకు వచ్చేసింది. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాట పాడింది. రతిక 4వ వారం ఎలిమినేటై రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 12వ వారం మరోసారి ఆమె ఎలిమినేట్ అయ్యింది. మొత్తంగా 9 వారాలు హౌస్లో ఉంది.

రతిక ఎలిమినేషన్ తో హౌస్లో 8 మంది మిగిలారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. మరో మూడు వారాలలో షో ముగుస్తుంది. వీరిలో మరో ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. ఐదుగురు ఫైనల్ కి వెళతారు. వారిలో ఒకరు టైటిల్ విన్నర్ అవుతారు. శివాజీ, ప్రశాంత్ ఫైనల్ కి వెళ్లడం ఖాయం. టైటిల్ రేసులో ఉండేది వీళ్ళే అని ప్రచారం అవుతుంది.