Homeఎంటర్టైన్మెంట్వీడియో వైరల్ః వేలికి ఉంగరం తొడిగించుకున్న అషూ..!

వీడియో వైరల్ః వేలికి ఉంగరం తొడిగించుకున్న అషూ..!

ఎవ‌రిలోనైనా టాలెంట్ ఉంటే స‌రిపోదు. దాన్ని నిరూపించుకునే వేదిక కావాలి. గ‌తంలో.. ఎవ‌రో ఒక‌రి ద‌యా దాక్షిణ్యాల మీద టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాల్సి వ‌చ్చేది. కానీ.. సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత త‌మ టాలెంట్ ను నేరుగా జ‌నాల్లోకి పంపించే ఛాన్స్ దొరికింది అంద‌రికీ. దీన్ని చ‌క్క‌గా ఉప‌యోగించుకుని, కెరీర్ బిల్డ్ చేసుకున్న‌వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒక‌రు అషూ రెడ్డి.

డబ్ స్మాష్ వీడియోల హ‌వా సాగిన స‌మ‌యంలో ఈ భామ చేసిన‌ హల్ చల్ మామూలుగా లేదు. ముఖ్యంగా సమంత వీడియోలను డ‌బ్ స్మాష్ చేస్తూ ఓ రేంజ్ లో పాపులరిటీ సంపాదించింది. దీంతో.. ఈ బ్యూటీని జూనియర్ సమంత అనే ట్యాగ్ కూడా వ‌రించింది. ఇక‌, ఈ అమ్మ‌డికి ఫుల్ హైప్ తెచ్చిన మ‌రో అంశం ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్ బేస్. తాను ప‌వ‌న్ కు వీరాభిమాని అని చెప్పిన అషూ.. ఇన్ సైడ్ టాటూ కూడా వేయించుకుంది. ఈ విధంగా ఫుల్ ఫేమ‌స్ అయిన ఈ బ్యూటీ హీరో నితిన్ ‘ఛల్ మోహన రంగ’ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

ఆ త‌ర్వాత‌.. బిగ్ బాస్ -3 షోలో ఎంట్రీ ఇచ్చి ర‌చ్చ చేసింది. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్-3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ తో వ్య‌వ‌హారం న‌డిపించింద‌నే గుస‌గుస‌లు వినిపించాయి. ఆ మ‌ధ్య‌ రాహుల్ అషూరెడ్డిని ఎత్తుకున్న ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టింది. దీంతో.. వీళ్ల మ‌ధ్య మ్యాట‌ర్ ప‌రిగెడుతోంద‌ని అనుకున్నారు. అయితే.. ఆ మ‌ధ్య రాహుల్ ఓ ఇంట‌ర్వ్యూలో వీళ్ల‌ రిలేష‌న్ పై ఓపెన్ అయ్యాడు. అషూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు.

ఈ విధంగా ఫేమ‌స్ అయిన అషూ.. ప్ర‌స్తుతం యాంక‌ర్ ర‌వితో క‌లిసి ప్రముఖ ఛానల్ లో ‘హ్యాపీ డేస్’ అనే షోకు యాంకరింగ్ చేస్తోంది. ఈ షోలో హాట్ డ్రెస్సుల‌తో, డైలాగ్స్ తో ర‌చ్చ చేస్తోంది అషూ. షోకు వ‌చ్చే పార్టిసిపెంట్ల‌తోపాటు ఆడియ‌న్స్ ను కూడా ఓ రేంజ్ లో ఆడుకుంటోంది. ఈ విధంగా.. హ్యాపీ డేస్ షోకు ఫుల్ గ్లామ‌ర్ అద్దుతూ.. స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ కావ‌డంలో త‌న వంతు పాత్ర పోషిస్తోంది.

అయితే.. లేటెస్ట్ గా ఈ అమ్మ‌డు వేలికి ఉంగ‌రం తొడిగించుకుంది. ఇందుకు సంబంధించిన‌ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది అషూ. ఆ ఉంగ‌రంపై AR అనే ఇంగ్లీష్ అక్ష‌రాలు రాసి ఉన్నాయి. దీంతో.. ఎంగేజ్ చేసుకుందా? అనే చ‌ర్చ కూడా మొదలైంది. అయితే.. ఆ రింగ్ తొడిగింది లేడీ ఫ్రెండ్‌. అంటే.. ఓ ఫ్రెండ్ ఆమెకు గిఫ్ట్ ఇచ్చింద‌న్న‌మాట‌. ఈ వీడియోను పోస్టు చేసిన అషూ.. ఫ్రెండ్స్ తనపై చూపించే ప్రేమతో భావోద్వేగానికి గురైంది. దీంతో.. ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular