Ashu Reddy: కిక్ ఇచ్చేలా జూనియర్ సమంత లేటెస్ట్ లుక్…సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అషురెడ్డి లేటెస్ట్ లుక్!

అషురెడ్డి బోల్డ్నెస్ కి తెరలేపింది. ఇంస్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో జూనియర్ సమంత ఫోటోలు సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Written By: S Reddy, Updated On : September 10, 2024 2:46 pm

Ashu Reddy

Follow us on

Ashu Reddy: అషురెడ్డి సోషల్ మీడియా గ్లామర్ డాల్ గా అవతరించింది. అషురెడ్డి బోల్డ్ ఫోటో షూట్స్ పై నెటిజన్స్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తన పంథా కొనసాగిస్తోంది. అదే సమయంలో గ్లామర్ ప్రియులు అషురెడ్డి అందాలను ఆస్వాదిస్తున్నారు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ మరింత కాకరేపెలా ఉంది.

అషురెడ్డి సోషల్ మీడియా స్టార్ గా వెలుగులోకి వచ్చింది. అనూహ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో ఛాన్స్ దక్కించుకుంది. అషురెడ్డి గేమ్ కంటే గ్లామర్ నే నమ్ముకుంది. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేసే ప్రయత్నం చేసింది. ఆడియన్స్ అషురెడ్డిని ఆదరించలేదు. ఆమె త్వరగా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ అత్యంత పాప్యులర్ షో కావడంతో మరింత ఫేమ్ ఆమెకు దక్కింది.

అషురెడ్డి పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. పూర్తి స్థాయి నటిగా సక్సెస్ కావాలనేది ఆమె కోరిక. అషురెడ్డి తరచుగా వివాదాల్లో ఉంటుంది. వరలక్ష్మి వ్రతం మోడ్రన్ డ్రెస్ లో చేసి విమర్శల పాలైంది. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలపై అతి పెద్ద చర్చ నడిచింది.

వర్మ-అషురెడ్డి ఇంటర్వ్యూ పేరుతో ప్రైవేట్ చాట్ చేసుకున్నారు. రెండు ఇంటర్వ్యూలు వీరు చేయడం విశేషం. ఆ మధ్య డ్రగ్స్ కేసులో అషురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్ అయ్యాడు. అషురెడ్డి-కేపీ చౌదరి మధ్య వందల ఫోన్ కాల్స్ చోటు చేసుకున్నాయని పోలీసులు సమాచారం సేకరించారు.

కేపీ చౌదరి డ్రగ్ కేసుతో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలను అషురెడ్డి ఖండించింది. నిరాధార కథనాలు ప్రసారం చేస్తే మీడియాపై చర్యలు ఉంటాయని ఆమె ఫైర్ అయ్యారు. ఒకప్పుడు బుల్లితెర షోలలో సందడి చేసిన అషురెడ్డి ఈ మధ్య కనిపించడం లేదు. ప్రేక్షకులు ఆమెను ఒకింత మిస్ అవుతున్నారు.

ఇటీవల ఫ్యామిలీ స్టార్స్ షోలో మాత్రం అషురెడ్డి పాల్గొంది. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న యేవమ్ మూవీలో అషురెడ్డి ఓ పాత్ర చేసింది. చాందిని చౌదరి ఈ మూవీలో పోలీస్ అధికారిగా నటించింది. యేవమ్ చిత్రం గురించి పెద్దగా చర్చ జరగలేదు.

ఇక మీ పెళ్లి ఎప్పుడంటూ అషురెడ్డికి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. దానికి ఇంకా సమయం ఉందంటుంది అమ్మడు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు వయసులో వివాహం చేసుకోవాలన్న విషయమే వదిలేస్తున్నారు. మరి అషురెడ్డి ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి..