Ashok galla
Ashok Galla: ‘అశోక్ గల్లా’ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘హీరో’. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా అలాగే, హీరో మహేష్ బాబు మేనల్లుడిగా అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. మీడియా కూడా ఈ సంక్రాంతికి పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు ఎంట్రీ అంటూ ఈ కొత్త హీరో పై ఓ రేంజ్ లో హడావిడి చేసింది.
Ashok Galla
కాగా ‘హీరో’ అనే పేరుతో అశోక్ గల్లాను హీరోగా పెట్టి శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మొత్తమ్మీద ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా బాగా సినిమా పై హైప్ ను పెంచారు. అయితే, ప్రమోషన్స్ ను ఎంత గట్టిగా చేసినా.. మహేష్ చేత బైట్ లు ఇప్పించినా.. ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం చాలా వీక్ గానే వస్తున్నాయి.
Also Read: ఆకాశ తరంగాలను తాకబోతున్న ఇళయరాజా కొత్త పాట !
ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే :
వెస్ట్ 0.09 కోట్లు
గుంటూరు 0.16 కోట్లు
కృష్ణా 0.08 కోట్లు
నెల్లూరు 0.06 కోట్లు
నైజాం 0.43 కోట్లు
సీడెడ్ 0.21 కోట్లు
ఉత్తరాంధ్ర 0.32 కోట్లు
ఈస్ట్ 0.13 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 1.48 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.07 కోట్లు
ఓవర్సీస్ : 0.08 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 1.63 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
ఓవరాల్ గా ఈ ‘హీరో’ చిత్రానికి రూ.5.6 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ ఉంది. అయినా ఇమేజ్ లేని ఒక కొత్త హీరోకి రూ.5.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అంటే కామెడీనే. ఒక విధంగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు ఎంత అమాయకులో అర్ధం అవుతుంది. అసలు ఇలాంటి సినిమా పై భారీగా ఖర్చు పెట్టడమే తప్పు. దానికి తోడు భారీ రేట్లకు అమ్మడం ఇంకా పెద్ద తప్పు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి నాలుగు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ. 1.63 కోట్ల షేర్ ను రాబట్టింది. కాబట్టి ఈ సినిమాకి గట్టిగా నాలుగు కోట్లు నష్టాలు గ్యారంటీ.
Also Read: వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు – అనసూయ