Dasari Narayana Sons: దాసరి నారాయణ రావు గారు మరణించిన తర్వాత వారి కుమారులు పలు వివాదాల్లో ఇరుక్కుని దాసరిగారి పరువు తీస్తున్నారు. అయితే తాజాగా దాసరి అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలిష్ స్టేషన్ లో కేసు నమోదైంది. అరుణ్ కుమార్ కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. 2 బైక్‌లను ఢీ కొట్టాడు. అతడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Dasari Narayana Sons
దాసరి అరుణ్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేస్తున్నారు. యాక్సిడెంట్స్‌కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడైన అరుణ్.. పలు సినిమాల్లో హీరోగా చేశాడు. చివరకు ఇలా ర్యాష్ డ్రైవింగ్ తో దాసరి గారి పరువు ను పోగొడుతున్నాడు. దాసరి నారాయణ రావు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఆయనే పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యకు పరిష్కారం చూపించేవారు, కానీ ఆయన మరణించిన తర్వాత వారి కుమారులు మధ్య వచ్చిన ఆస్తి పంపకాల సమస్యను మాత్రం ఎవరు తీర్చలేకపోయారు.
Also Read: ప్చ్.. ‘హీరో’కి 4 కోట్లు నష్టాలు తప్పేలా లేవు !
ఇప్పటికే అన్నదమ్ములిద్దరూ పలు వివాదాల్లో ఇరుక్కుని దాసరిగారి పరువు తీశారు. అసలు దాసరి నారాయణ రావు అంటే.. ఒక చరిత్ర. ఇప్పటికీ ఆయన అంటే దర్శకుల జాతికే గర్వకారణం. కానీ, నేడు ఆయన ఇంట్లో ఉన్న సమస్యలను పట్టించుకునేవారే లేకపోవడం దురదృష్టకరం. అలాగే దాసరి గారి కుమారులు అనేక వివాదాల్లో చిక్కుకోవడం బాధాకరమైన విషయం. గతంలో అరుణ్ కుమార్ పై ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్ కి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని అరుణ్ కుమార్ అప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు మరో కేసు ప్చ్.
Also Read: ఆకాశ తరంగాలను తాకబోతున్న ఇళయరాజా కొత్త పాట !