Homeఎంటర్టైన్మెంట్Asha Bhosle: కొడిగట్టిన దీపంలా .. అదిగో అప్పుడే ఆశా భోంస్లే జీవితంలోకి అతడొచ్చాడు

Asha Bhosle: కొడిగట్టిన దీపంలా .. అదిగో అప్పుడే ఆశా భోంస్లే జీవితంలోకి అతడొచ్చాడు

Asha Bhosle: మనలో చాలామందికి ఒక బలమైన అభిప్రాయం ఉంటుంది. సెలబ్రిటీల జీవితం గొప్పగా ఉంటుందని.. వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి స్వర్గసుఖాలు అనుభవిస్తుంటారని అనుకుంటాం. కానీ, నాణేనికి బొమ్మ ఉన్నట్టే.. బొరుసు కూడా ఉంటుంది. ప్రముఖ గాయని ఆశా భోంస్లే జీవితంలో కూడా ఇదే జరిగింది. 14 భాషలలో.. వేల పాటలు పాడిన ఆమె.. ఎన్నో కష్టాలను అధిగమించారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎంతోమంది అవహేళన చేస్తుంటే తట్టుకున్నారు. తన జీవితంలో కొడిగడుతున్న ఆశను.. బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగారు.

ఆశా భోంస్లే మొదటి భర్త గణపత్ నుంచి 1960లో విడిపోయారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. అప్పటికే ఆమె తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. గాత్రం బాగుంటుంది కాబట్టి అవకాశాలు వచ్చేవి. ఈ క్రమంలో 1980లో సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ ను రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య 1966లో పరిచయం ఏర్పడింది. అప్పట్లో తీస్రీ మంజిల్ అనే సినిమాకు బర్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఓ పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బర్మన్ స్వరపరిచిన అనేక సినిమాలలో ఆశ పాటలు పాడింది..

మొదట్లో వారిద్దరి మధ్య స్నేహం ఉండేది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో బర్మన్ ఉన్నట్టుండి ఒకరోజు ఆమెకు పెళ్లి ప్రపోజల్ చేశారు. దానికి ఆమె ఒప్పుకుంది. అయితే బర్మన్ చేసిన పని అతడు తల్లికి ఏమాత్రం నచ్చలేదు. తల్లి అలకపాన్పు ఎక్కడుందో కొద్దిరోజుల పాటు బర్మన్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో బర్మన్ తండ్రి చనిపోయాడు. తల్లి కూడా మానసిక అనారోగ్యానికి గురైంది. ఈ నేపథ్యంలో 1980లో ఆశాను అతడు పెళ్లి చేసుకున్నాడు. 1994 వరకు వారిద్దరి వైవాహిక జీవితం అద్భుతంగా సాగింది. 1994లో బర్మన్ చనిపోయాడు.

కెరియర్ తొలి రోజుల్లో ఆశాకు అంతగా అవకాశాలు రాలేదు. 1947లో ఓ ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో పాట పాడేందుకు ఆమె వెళ్లారు. ఆమెతోపాటు దిగ్గజ గాయకుడు కిషోర్ కుమార్ కూడా వెళ్ళాడు. అర్ధరాత్రి వరకు వారిద్దరిని అక్కడ అలానే కూర్చోబెట్టారు. అవకాశం కూడా ఇవ్వలేదు.. ఆ తర్వాత ఆశ పట్టుదలతో తను ఏమిటో నిరూపించుకుంది. కిషోర్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదుల కొద్ది భాషల్లో.. ఏకంగా 12 వేలకు పైగా పాటలను పాడి భారతీయ సంగీత పరిశ్రమపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది ఆశ.. అవకాశాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు. రానప్పుడు కుంగిపోలేదు. తనమీద తనకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఈరోజు ఆశాను ఈ స్థాయిలో నిలబెట్టింది. కొందరు అవకాశాల కోసం ఇబ్బంది పడుతుంటారు. అవకాశాలు వచ్చిన తర్వాత ఆకాశంలోకి ఎక్కేస్తుంటారు. కానీ ఆశ మాత్రం స్థిరంగానే ఉంది. ఆమె పాదాలు భూమ్మీదనే ఉన్నాయి. అందువల్లే ఇంతటి పేరు.. ఈ స్థాయిలో ప్రఖ్యాతలు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version