సండే స్పెషల్ : పాన్ ఇండియా హీరోలుగా.. తెలుగు హీరోలు !

పాన్‌ ఇండియా.. ఇప్పుడు అందరి హీరోల చూపు నేషనల్ మార్కెట్ వైపే. పాన్ ఇండియా సినిమా అంటే.. కథ, కథనం, నటీనటులు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే, అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర హీరోలు చిత్రాలు పాన్‌ ఇండియాను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కుతుండటంతో.. ఆయా సినిమాల పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. హీరోలు సైతం తమ సినిమాల కోసం ఏకంగా […]

Written By: admin, Updated On : January 10, 2021 12:28 pm
Follow us on


పాన్‌ ఇండియా.. ఇప్పుడు అందరి హీరోల చూపు నేషనల్ మార్కెట్ వైపే. పాన్ ఇండియా సినిమా అంటే.. కథ, కథనం, నటీనటులు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే, అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర హీరోలు చిత్రాలు పాన్‌ ఇండియాను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కుతుండటంతో.. ఆయా సినిమాల పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. హీరోలు సైతం తమ సినిమాల కోసం ఏకంగా సంవత్సరాలకు సంవత్సరాలను టైంను పెట్టేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ హీరో నుండి ఏ పాన్ ఇండియా సినిమా వస్తోందో చూద్దాం.

Also Read: లవ్ స్టోరీ టీజర్ టాక్: నిరుద్యోగ ప్రేమ కంచికి చేరిందా?

తెలుగు స్టార్స్ లో పాన్ ఇండియా సినిమా అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు ప్రభాస్. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్క్లూజన్’ చిత్రాల అంతర్జాతీయ స్థాయిలో భారీ విజయాలు సాధించడం, ఆ తర్వాత నటించిన ‘సాహో’ బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చడం.. మొత్తానికి ప్రభాస్ నుండి వచ్చే సినిమా పాన్ ఇండియా ఇమేజ్ ను దక్కించుకుంటూ ఉంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధేశ్యామ్’ వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇది కూడా అన్ని భాషల్లో విడుదల కానుంది. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మరో సినిమా ఇలా ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.

ఇక రాజమౌళి నుండి రానున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ పాత్రలను పరిచయం చేసి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక పాత్రలకు కల్పితగాథను జోడించి రాజమౌళి ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక ఈ సినిమా తర్వాత కూడా ఇద్దరు కథానాయకులు పాన్‌ ఇండియా కథలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కూడా ఎన్టీఆర్‌ కోసం పాన్‌ ఇండియా స్థాయి కథను సిద్ధం చేశారు. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోనూ ఆ స్థాయి కథతోనే తారక్‌ నటించనున్నాడు. అలాగే చరణ్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నారు.

Also Read: సోనూ సూద్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు..!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’ కూడా పాన్ ఇండియా సినిమానే. లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా బన్నీ నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందట. తెలుగుతో పాటు, మలయాళంలో అల్లు అర్జున్‌ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉండటం, ఇప్పుడు ‘పుష్ప’ను ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో.. మొత్తానికి ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.

అలాగే ‘కె.జి.యఫ్‌’. కన్నడ చిత్రంగా విడుదలై పాన్‌ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుని.. త్వరలో సీక్వెల్ తో కూడా మన ముందుకు రాబోతోంది. ‘కేజీయఫ్‌2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో యశ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. విజయ్‌ దేవరకొండ, మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’ కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ సినిమాకి జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. వీరే కాదు, రానా, మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా పాన్‌ ఇండియా స్టార్‌లుగా మారడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్