విశాల్ ట్విటర్ లో మెసేజ్ చేస్తూ.. తాను మావయ్యని అయ్యానని, చాలా ఎమోషనల్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. విశాల్ మాటల్లోనే ‘ఈ న్యూస్ ను అందరికి చెబుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా బ్రదర్ ఆర్య సతీమణి సాయేషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నేను అంకుల్ ను అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.
షూటింగ్ లో బిజీగా ఉన్న నాకు ఈ వార్త చెప్పలేని అనుభూతిని కలిగించింది. ఆర్య తండ్రిగా తన కొత్త బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చాలని.. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ విశాల్ ఆర్యతో తన అనుబంధాన్ని గుర్తుకుతేస్తూ ట్వీట్ చేయడం బాగా ఆకట్టుకుంది.
కాగా, విశాల్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఆర్య, సయేషా సైగల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్య, విశాల్ కలిసి ప్రస్తుతం ‘ఎనిమీ’ అనే సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. అన్నట్టు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్ లోనే జరుగుతుంది. విశాల్ షూట్ లో పాల్గొంటున్నాడు.