Jabardast: ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్’ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఓ ట్రెంట్ సెట్టర్ గా ఈ షో నిలిచింది. ఏడుపుగొట్టు సీరియల్స్ కు అలవాటుపడిన బుల్లితెర ప్రేక్షకులను ఎంటటైన్మెంట్ కోరుకుంటునేలా జబర్దస్ షో చేసింది. పూర్తి కామెడీతో సాగిపోయే ఈ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షో కంటే ముందే పలు కామెడీ షోలు వచ్చినప్పటికీ జబర్దస్త్ మాత్రం ఓ రేంజులో క్లిక్ అయింది.
గంటసేపు ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంలో కంటెస్టెంట్స్ చేసే స్కీట్లకు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వడం ఖాయం. ఈ షోకు అత్యధిక టీఆర్పీలు రావడంతో నిర్వాహకులు జబర్దస్ తోపాటు ఎక్స్ ట్రా జబర్దస్ ను కూడా ప్రారంభించారు. గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
జబర్దస్త్ ప్రొగ్రాం వల్ల అనేక మంది కొత్త కామెడీయన్లు వెలుగులోకి వచ్చారు. వీరికి సినిమా ఛాన్సులు రావడంతో జబర్దస్త్ ఆర్టిస్టులు బీజీగా మారిపోయాయి. అయితే పాత ఆర్టిస్టుల స్థానంలో కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తుండటం కన్పిస్తోంది. అలాగే జబర్దస్త్ పోటీగా ఇటీవల పలు టీవీ ఛానల్స్ కామెడీ షోలు నిర్వహిస్తున్నారు. దీంతో క్రమంగా జబర్దస్త్ టీఆర్పీ తగ్గుతూ వస్తోంది.
తొలినాళ్లలో జబర్దస్, ఎక్స్ ట్రా జబర్దస్ కార్యక్రమాలకు టీఆర్పీ 12, 13కు తగ్గకుండా వచ్చేది. దీంతో నిర్వాహకులకు ఈ షో కాసులవర్షం కురిపించింది. అయితే గతకొంతకాలంగా టీఆర్పీ 4కు మించి రావడం లేదని సమాచారం. దీంతోపాటు జబర్దస్ లోని లేడి ఆర్టిస్టులను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
క్యాస్టింగ్ కౌచ్ లాంటివి జబర్దస్ లో వెలుగుచూస్తున్నాయి. ఈ విషయాలు ‘మల్లెమాల’ టీం దగ్గరకు కొందరు లేడి ఆర్టిస్టులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. స్కీట్ల పేరుతో తమను కొందరు ఇబ్బందులకు గురిచేస్తుండటంపై లేడి ఆర్టిస్టులు ఫైర్ అవుతున్నారు. త్వరలోనే ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు జబర్దస్త్ లో ఆర్టిస్టులను ఆగ్రిమెంట్ ముగింపుకు వస్తున్నా నిర్వాహకులు రెన్యూవల్ చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు ఇతర షోల వైపు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే జబర్దస్త్ ప్రస్థానానికి ఎండ్ కార్డు పడటం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. మరీ దీనిపై జబర్దస్ నిర్వాహకులు, ఈటీవీ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!