https://oktelugu.com/

James Cameron On AI: కృత్రిమ మేధ జేమ్స్ కామెరాన్ షాకింగ్ కామెంట్స్.. 1984 లోనే హెచ్చరించాడా ?

జేమ్స్ కామెరాన్ తెరక్కెయించిన `టెర్మినేటర్‌` మూవీ కథ స్కైనెట్‌ అనే సూపర్‌ కంప్యూటర్‌ సృష్టించిన సైబర్నెటిక్‌ హంతకుడి చుట్టూ తిరుగుతుంది, ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ తో కృత్రిమ మేధ ని ఆయుధీకరిస్తే అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది, ఇదే విషయాన్ని జేమ్స్ కామెరూన్‌ కూడా అంగీకరించాడు. నా సినిమాలో చూపించినట్లుగా బయట జరిగే ప్రమాదం ఉందని జేమ్స్ చెప్పడం విశేషం.

Written By:
  • Shiva
  • , Updated On : July 22, 2023 10:49 am
    James Cameron On AI

    James Cameron On AI

    Follow us on

    James Cameron On AI: వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) మానవ మనుగడకే ముప్పు తీసుకొచ్చే విధంగా మారిపోతున్న విషయం తెలిసిందే, తాజాగా ఈ విషయంపై ప్రపంచ మేటి దర్శకుడు అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “కృత్రిమ మేధస్సు మానవ మనుగడకే ప్రమాదకరం అని” తాను 1984లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్‌ మూవీ `ది టెర్మినేటర్‌` తో హెచ్చరించినట్టు చెప్పారు.

    జేమ్స్ కామెరాన్ తెరక్కెయించిన `టెర్మినేటర్‌` మూవీ కథ స్కైనెట్‌ అనే సూపర్‌ కంప్యూటర్‌ సృష్టించిన సైబర్నెటిక్‌ హంతకుడి చుట్టూ తిరుగుతుంది, ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ తో కృత్రిమ మేధ ని ఆయుధీకరిస్తే అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది, ఇదే విషయాన్ని జేమ్స్ కామెరూన్‌ కూడా అంగీకరించాడు. నా సినిమాలో చూపించినట్లుగా బయట జరిగే ప్రమాదం ఉందని జేమ్స్ చెప్పడం విశేషం.

    ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ మీద అనేక చర్చోప చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే, ఇప్పుడు జరుగుతున్న ప్రయోగాలను మించి ముందుకు వెళితే అది మానవ జాతి మనుగడనే ప్రమాదంలో పడేస్తుందని అనేక మంది వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో జేమ్స్ కామెరూన్‌ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కృత్రిమ మేధకు ఆయుధీకరణ చేస్తే అది విపత్కర పరిణామాలకు దారి తీస్తుందన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తాను ఆ వ్యాపారవేత్తలతో ఏకీభవిస్తున్నానని, ఈ విషయంపై తాను 1984లోనే హెచ్చరించానని, కానీ దాన్ని పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు.

    ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధరంగంలో కృత్రిమ మేధని ఉపయోగించుకొని సూపర్ కంప్యూటర్స్ ద్వారా ముందుకు పోవాలని చూస్తున్నాయి, అలా చేస్తే ఇక శాంతి చర్చలు,యుద్ధ విరమణ అవకాశాలు లేకుండా పోతాయన్నారు. అలాంటి ఏఐలను నియంత్రించాలంటే `ఢీ ఎస్కలేషన్‌`పై దృష్టి పెట్టాలని తెలిపారు. కానీ కృత్రిమ మేధ వ్యవస్థ అలాంటి సూత్రాలకు కట్టుబడి ఉంటుందా అనే సందేహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అణ్వాయుధాల్లో ప్రస్తుతం ఉన్న పోటీకి సమానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ పోటీ చేరుకుంటుందని భావిస్తున్నానని ఈ దర్శక దిగ్గజం చెప్పుకొచ్చాడు.

    ట్విట్టర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్లీవ్‌ వోజ్నియాక్‌ లాంటి ప్రముఖులు మాట్లాడుతూ ఏఐతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది వినాశకరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, దానికి వ్యతిరేకంగా వెయ్యి మందికిపైగా నిపుణులు సంతకం చేసి, `పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్ పరిమెంట్‌` పేరిట ఈ లేఖని విడుదల చేశారు.