Bigg Boss 9 Agni Pariksha Challenge: టెలివిజన్ రంగంలో పలుమార్పులు అయితే వచ్చాయి. ప్రస్తుతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని టెలివిజన్ యాజమాన్యం మొత్తం హంగులు ఆర్భాటాలు చేస్తూ రియాల్టీ షోలను కండక్ట్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే బిగ్ బాస్ షో కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. గత 8 సీజన్లు గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. కాబట్టి ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే అగ్నిపరీక్ష అంటూ సామాన్య మానవులకు సైతం ఈ షో లో భాగం చేయబోతున్నారు. మరి అందులో ఎవరైతే తమ సత్తా చాటుకుంటారో వాళ్ళను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు… ఇక ఇలాంటి సందర్భంలోనే 45 మంది కంటెస్టెంట్లతో అగ్నిపరీక్ష అనే షో ను అయితే రన్ చేస్తున్నారు. మరి ఇందులో సత్తా చాటుకున్న కేవలం 5 మందిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటారనే విషయాన్ని కూడా జడ్జెస్ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ అనే కంటెస్టెంట్ చాలా తెలివి గా గేమ్ అయితే ఆడుతున్నాడు. రీసెంట్ గా జరిగిన ఫోర్త్ ఎపిసోడ్లో ఫుడ్ అంటే బాగా ఇష్టం ఉన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒకసారి స్టేజి మీదకి రా అనే అభిజిత్ పిలవగానే ఆయన స్టేజ్ మీదకు వచ్చాడు. ఇక నీతో పాటు పోటీ పడే కంటెస్టెంట్ ఎవరో నువ్వే సెలెక్ట్ చేసుకో అనగానే పవన్ కళ్యాణ్ ను అడగగా ఆయన అబూ ను సెలెక్ట్ చేసుకున్నాడు. స్వతహాగా బాడీ బిల్డర్ అయిన అబూ ను సెలెక్ట్ చేసుకోవడంతో వాళ్ళిద్దరికి పోటీ ఏంటి అని అందరూ ఆశ్చర్య పోయారు… మొత్తానికైతే వీరిద్దరిని చూసిన జడ్జెస్ ఇద్దరి వెయిట్ చూశారు. అందులో ఒకరు 72, మరొకరు 73 కేజెస్ అయితే ఉన్నారు…ఇక ఇప్పుడు కాంపిటీషన్ ఏంటి అనుకుంటున్నారు అని అభిజిత్ అడగగా అందులో అబూ ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ ఉండొచ్చు అని సమాధానం చెప్పాడు. కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫుడ్ కు సంబంధించిన ఏదో పోటీ ఉండబోతుంది అని క్లారిటీగా చెప్పేశాడు.
Also Read: ఆర్మీ పవన్ కళ్యాణ్ నే రిజెక్ట్ చేశాడు.. ఇప్పుడు అభిజీత్ మీద పడిపోతున్నారు…
అయితే అభిజిత్ స్టార్టింగ్ లో బిగ్ బాస్ కి వెళితే ఫుడ్ బాగా తినచ్చు అంటూ సంధానం చెప్పిన పవన్ కళ్యాణ్ ను స్టేజ్ మీదికి రా అని స్పెషల్ గా పిలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుడ్ కి సంబంధించిన గేమ్ ఆడబోతున్నాం అని తెలుసుకొని కాంపిటేటర్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని చెప్పినప్పుడు అబూ ను సెలెక్ట్ చేసుకున్నాడు.
కారణం ఏంటి అంటే ఫుడ్ కి సంబంధించిన గేమ్ ఆడితే అబూ ఎక్కువగా తినలేడు. ఎందుకంటే అబూ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు కాబట్టి అతను చాలా సెలెక్టెడ్ గా ఫుడ్ తీసుకుంటాడు. డైట్ ఫాలో అవుతూ ఉంటాడు కాబట్టి ఒక్కసారిగా హెవీ ఫుడ్ అయితే తినలేడు. పవన్ కళ్యాణ్ గెస్ చేసినట్టుగానే ఫుడ్ కాంపిటీషన్ పెట్టారు…ఇక ఈ పోటీలో పవన్ కళ్యాణ్ మాత్రం హెవీగా తిన్నాడు.
Also Read: మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టేనా..?
ఇక ఇద్దరి వెయిట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఉన్న వెయిట్ కంటే ఒక కేజీ పెరిగాడు. అబూ మాత్రం 1 కేజీ పెరిగలేకపోయాడు. దాంతో ఈ టాస్క్ లో పవన్ కళ్యాణ్ గెలుపొందినట్టుగా నిర్ణయించారు. మొత్తానికైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇక్కడ తను గెలవడానికి ఒక ట్రిక్ వాడి అబూ ను సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడే అతను సక్సెస్ అయ్యాడని చాలామంది అభిప్రాయ పడుతున్నారు…