ARM Movie Review: మలయాళం సినిమా ఇండస్ట్రీలో చాలా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు రూపొందిస్తుంటారు. ఇక ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో వాళ్ళు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. అందుకే మలయాళం సినిమా ఇండస్ట్రీలోనే చాలా కొత్త కథలు వస్తు ఉంటాయి. హీరోలు కూడా అలాంటి కథలను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా అవార్డులను కూడా చాలా పెద్ద ఎత్తున గెలుచుకోవడానికి ఆస్కారమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం టొవినో థామస్ హీరోగా చేసిన ‘ఏ ఆర్ ఎం’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా టొవినో థామస్ కి తెలుగులో ఒక మంచి సక్సెస్ దక్కిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1990 వ సంవత్సరం లో కేరళలోని కడక్కల్ అనే ప్రాంతం లో చిన్న ఎలక్ట్రికల్ పనులను చేస్తూ కాలం గడుపుతుంటాడు అజయ్ (టోవినో థామస్)..ఇక ఆ ఊర్లో ఒక జమిందారు ఉంటారు. ఆయన కూతురు అయిన లక్ష్మి (కృతి శెట్టి) అజయ్ ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇక లైఫ్ చాలా సాఫీగా సాగుతుంది అనుకున్న అజయ్ జీవితం లో ఒక పెను సంచలనం జరుగుతుంది. అదేంటి అంటే అజయ్ వాళ్ల తాత అయిన మనియన్ ఒక పెద్ద గజ దొంగ…ఆయన ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటే ఆ ఇంట్లో దొంగతనం చేస్తాడు… ఇక కాళ్ళ కి గజ్జలు కట్టుకొని మరి దొంగతనం చేయడం లో ఆయన స్పెషలిస్ట్…ఇక వాళ్ల తాత పోయిన తర్వాత అజయ్ మీద దొంగ అనే ముద్ర పడుతుంది. ఇక ఇదే సమయం లో ఆ ఊరిలో ఉన్న పురాతనమైన గుళ్ళో ఒక దీపం ఉంటుంది.
హరీష్ ఉత్తమన్ ఆ దీపాన్ని దొంగలిస్తాడు. ఆ దొంగతనం అజయ్ చేశాడంటూ రచ్చ జరుగుతుంది. తీరా హరీష్ ఉత్తమన్ దొంగలించిన దీపం నకిలిది అని తెలుస్తుంది. మరి అసలు దీపం ఎక్కడికి పోయింది. అసలు ఆ దీపానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? హరీష్ ఉత్తమన్ ఎందుకు ఆ దీపాన్ని దొంగిలించాలను కున్నాడు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈ సినిమాను మొదట చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళినప్పటికి, 1990 బ్యాక్ డ్రాప్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు సినిమా కొంచెం స్లో గా ముందుకు సాగినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ దొంగతనం జరిగిన పరిస్థితులను చాలా చక్కగా చూపించాడు. అలాగే సినిమాలో దీపానికి ఉన్న వాల్యూ ఏంటి అనేది కూడా తను చక్కగా వివరించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు తను అనుకున్న పాయింట్ ను చాలావరకు ప్రేక్షకుడికి నచ్చే విధంగా తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ మధ్యలో కొన్ని డివిషన్స్ ఆయన అనుకున్న పాయింట్ ను అనుకున్నట్టుగా తెరమీద చూపించలేకపోయాడు. ఇక టోవినో థామస్ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడనే చెప్పాలి.
సినిమా మధ్యలో కొన్ని పాయింట్లకి కన్ క్లూజన్ ఇవ్వలేకపోయాడు. ఎమోషన్ పరంగా సినిమాని కొంతవరకు హుక్ చేసి ముందుకు తీసుకెళ్లినప్పటికీ టోటల్ సినిమాగా చూస్తే మాత్రం కథ బాగున్నప్పటికీ కథనంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక ఇప్పటికే టొవినో థామస్ చాలా మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఆయనకు తెలుగులో కూడా కొంతవరకు మార్కెట్ అయితే ఏర్పడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా చేయడం ఒక వంతుకు మంచిదే అయినప్పటికీ ఆయనకు సక్సెస్ అయితే దక్కకపోవచ్చు…ఈ సినిమా మధ్యలో కొంత బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక కొంతవరకు ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నప్పటికీ ఓవరాల్ గా సినిమా మాత్రం ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసినంత లేదనే చెప్పాలి..
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ‘టొవినో థామస్ ‘గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ను అయితే ఇచ్చాడు. ఇక తాతగా, మనవడిగా తన పోషించిన రెండు పాత్రలు సినిమాకి జీవం పోయడమే కాకుండా నటనతో ఆయన మరొక మెట్టు పైకి ఎక్కడానే చెప్పాలి. ఇక ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అయితే చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు… ఆయన వల్లే ఈ సినిమా కొంత వరకు హై రేంజ్ లోకి అయితే వచ్చింది. ఇక హీరోయిన్ కృతి శెట్టి పాత్ర కూడా చాలా బాగా ఎలివేట్ అయితే అయింది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్లో ఇద్దరి యాక్టింగ్ కూడా చాలా సెటిల్డ్ గా ఉంది.
ఇక కృతిశెట్టికి ‘ఉప్పెన ‘ సినిమా తర్వాత సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు. మరి ఈ సినిమాలో తన పాత్ర చాలా డీసెంట్ గా ఉన్నప్పటికీ సినిమా సక్సెస్ అవుతుందా? లేదా అనే దాని మీదనే ఇప్పుడు ఆమె ఆశాలైతే పెట్టుకుంది…ఇక ఐశ్వర్య రాజేష్ కూడా చాలా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది… హరీష్ ఉత్తమన్ మిగితా సినిమాల కంటే కూడా తన పాత్రని చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నాడు. ఆయన ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలావరకు హెల్ప్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి… దర్శకుడు జితిన్ లాల్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి చాలా మంచి మ్యూజిక్ రాబట్టుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక జాన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ఈ సినిమాకు విజువల్ గా గ్రాండ్ లుక్ తీసుకురావడం లో ఆయన చాలా వరకు ప్రయత్నం చేశాడు…
ప్లస్ పాయింట్స్
కథ
టొవినో థామస్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
స్క్రీన్ ప్లే
కొన్ని బోరింగ్ సీన్స్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5
చివరి లైన్
టొవినో థామస్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను చూడవచ్చు…