Homeఎంటర్టైన్మెంట్Actor Sri Vishnu: ఉత్కంఠ రేపుతున్న 'అర్జున ఫల్గుణ' టీజర్​

Actor Sri Vishnu: ఉత్కంఠ రేపుతున్న ‘అర్జున ఫల్గుణ’ టీజర్​

Actor Sri Vishnu: సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్​గ్రౌండ్​ లేకున్నా స్వతహాగా కష్టపడి విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్​ హీరో శ్రీ విష్ణు. ఇటీవలే కాలంలో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన రాజరాజ చోర్​ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోరుతోనే వరుస ప్రాజెక్టులతో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. ఇలా ఆయన చేస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్టుల్లో దర్శకుడు తేజ మర్ని కాంబోలో తెరకెక్కిన సినిమా అర్జున పల్గుణ. సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలను క్రియేట్​ చేస్తూ వచ్చింది. తాజాగా, విడుదలైన ఈ సినిమా టీజర్​ ఆ అంచనాలను వేరే రేంజ్​కు తీసుకెళ్లాయి.

Arjuna Phalguna Teaser | Sree Vishnu, Amritha Aiyer | Teja Marni | Matinee Entertainment

టీజర్​ స్టార్టింగ్​లోనే ఆసక్తికర డైలాగ్​తో మొదలై.. మెల్లగా ఇంటెన్స్​ మోడ్​లోకి తీసుకెళ్లింది. ఇప్పటి వరకు శ్రీ విష్ణు చేసిన సినిమాలకంటే ఈ సినిమాలో అతని పాత్ర భిన్నంగా ఉండబోతోందని టీజర్​ను బట్టి తెలుస్తోంది. కాగా, ఇందులో అమృత, జబర్దస్త్​ మహేశ్​, సుబ్బరాజు పలువురు కీలక పాత్రలు పోషించినట్లు టీజర్​లో తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాకు జగదీశ్ చీకటి సినిమాటోగ్రాఫర్​గా పనిచేశారు. మ్యాట్నీ ఎంటర్​టైన్మెంట్స్​ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​. కాగా, నీది నాది ఒకే కథ సినిమాతో ప్రజల హృదయాలను కొల్లగొట్టిన శ్రీవిష్ణు.. తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా మద్యతరగతి కుటుంబంలో.. ఓ యువకుడి జీవితానికి సంబంధించింది. మరోవైపు, వేణు ఉడుగుల విరాటపర్వం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version