Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 మరో వీకెండ్ కి చేరుకుంది. శనివారం హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. కొందరికి ఇచ్చి పడేశాడు. ఈ వారం అంతా టికెట్ టు ఫినాలే రేస్ జరిగింది. ఈ గేమ్ లో మొదటిలోనే తప్పుకున్న శివాజీ, శోభ ఎఫర్ట్స్ పెట్టలేదని నాగార్జున అన్నారు. శివాజీ చేయి నొప్పి సాకుగా చూపే ప్రయత్నం చేశాడు. నాగార్జున తిప్పికొట్టాడు. శోభ 200% ఇచ్చాను సర్ అని చెప్పింది. అది పాయింట్స్ లో కనబడలేదు అన్నాడు.
అనంతరం గౌతమ్, ప్రియాంకలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ప్రియాంక గ్రూప్ గేమ్ ఆడుతుందన్నాడు. కాదు సర్ అని ప్రియాంక సమర్ధించుకుంది. ఫినాలే రేసు నుండి తప్పుకున్న గౌతమ్ తన పాయింట్స్ ఎవరికి ఇవ్వాలో ప్రియాంక డిసైడ్ చేసింది. అర్జున్ కి కాకుండా అమర్ కి ఇవ్వాలని చెప్పింది. గౌతమ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన ప్రియాంకను నాగార్జున తప్పుబట్టారు.
గౌతమ్, ప్రియాంకలు ఇకపై గ్రూప్ గేమ్ ఆడటానికి కుదరదని గట్టిగా చెప్పాడు. అనంతరం ఫినాలే అస్త్ర గెలిచిన అర్జున్ ని నాగార్జున అభినందించాడు. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ ఫైనలిస్ట్ గా ప్రకటించారు. మరో ట్విస్ట్ ఏమిటంటే… నామినేషన్స్ నుండి అర్జున్ ని తప్పించాడు. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఫినాలే అస్త్ర వేస్ట్ అని బావించాము. కానీ ఫినాలే అస్త్ర గెలిచిన కారణంగా అర్జున్ ని ఈ వారం కూడా నామినేషన్స్ నుండి మినహాయింపు ఇచ్చారు.
ఇక అర్జున్ టాప్ 5 లో ఒకరిగా ఉన్నాడు. ఫైనల్ కి వెళ్లే మిగతా నలుగురు ఎవరనేది చూడాలి. కాగా ఫినాలే అస్త్ర రేసులో రెండో స్థానంలో నిలిచిన అమర్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. కెప్టెన్ కావాలన్న తన కోరిక నెరవేర్చాడు. 14వ వారానికి అమర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. దాంతో అమర్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.