Arjun Son Of Vyjayanthi Trailer: కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'(Arjun S/O Vyjayanthi) చిత్రం ఈ నెల 18 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayasanthi) కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. తల్లి కొడుకుల మధ్య అద్భుతమైన బాండింగ్ ని డైరెక్టర్ వెండితెర పై చూపించాడని స్పష్టంగా తెలిసింది. అయితే నేడు ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో తల్లి కొడుకుల మధ్య కేవలం ప్రేమానురాగాలు మాత్రమే కాదు, ద్వేషం, సంఘర్షణ ఉన్నట్టుగా కూడా చూపించారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ .లాగా అనిపించిందని ఈ ట్రైలర్ ని చూసిన వారంతా అంటున్నారు.
Also Read: ఆ విషయంలో నేను ఎన్టీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటాను – హృతిక్ రోషన్
ట్రైలర్ ని చూసిన తర్వాత కథ విషయం లో ఒక పూర్తి అంచనాకు రావొచ్చు. వైజయంతి న్యాయం కోసం పోరాడే ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. కానీ ఏదైనా చట్టపరంగా వెళ్లాలని అనుకుంటుంది. తన కొడుకు కూడా తన లాగానే ఎదగాలని అనుకుంటుంది. అందుకే అతను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటుంది. కానీ పోలీస్ ఆఫీసర్ అయితే రూల్స్ ని పాటిస్తూ వెళ్ళాలి, న్యాయం జరగడం ఆలస్యం అవ్వొచ్చు, అందుకే అర్జున్ వేరే మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆ మార్గం లోకి వెళ్లినప్పటి నుండి తల్లి అతన్ని ద్వేషిస్తూ వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు, సంఘటనల కారణంగా అర్జున్ తన తల్లి కోరికని మన్నించి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే స్టోరీ అని ఈ ట్రైలర్ ని చూస్తే స్పష్టం గా అర్థం అవుతుంది.
కానీ ఇలాంటి సినిమాలను మన చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కథలు నేటి తరం ఆడియన్స్ కి అవుట్ డేటెడ్ వెర్షన్. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ స్పేస్ లో ఈ చిత్రం లేదు అనేది స్పష్టంగా ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ ఈమధ్య కాలం లో అసలు పట్టించుకోవడం లేదు. కళ్యాణ్ రామ్ నందమూరి హీరో కాబట్టి కాస్త ఓపెనింగ్స్ అయితే వస్తాయి కానీ, లాంగ్ రన్ మాత్రం వచ్చే సమస్య లేదని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ సినిమాని పూర్తిగా కూడా తీసి పారేయలేము. ట్రైలర్ ని చూస్తుంటే ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యినట్టు ఉన్నాయి, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, కాబట్టి యూత్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఆదరించే అవకాశాలు ఉన్నాయి. వరుసగా రెండు ఫ్లాప్స్ తో డీలాపడిన కళ్యాణ్ రామ్, ఈ సినిమాతో కం బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.
