Arjun Sarja: సినీ పరిశ్రమలో వారసులు రావడం కొత్తేమి కాదు. అదే దారిలో వారసురాళ్లు కూడా సినీ పరిశ్రమలో అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా నార్త్ లో వారసురాళ్లు హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. రావడమే కాకుండా అగ్ర హీరోయిన్స్ గా కూడా చలామణి అవుతున్నారు. కానీ మన సౌత్ లోకి వచ్చేసరికి సక్సెస్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కప్పటి హీరో అర్జున్ తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే.
తమిళ హీరో విశాల్ సరసన హీరోయిన్ గా ‘మదయానై’ చిత్రంతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఐశ్వర్య కు ఆ సినిమా కెరీర్ పరంగా పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఏకంగా అర్జున్ దర్శకుడి అవతారం ఎత్తి తన కూతురిని హీరోయిన్ గా పెట్టి “సొల్లితరువా” అనే సినిమాను తమిళ, కన్నడ లో తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఐశ్వర్య తొలి విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది.
ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెలుగులో ఒక సినిమాను మొదలుపెట్టాడు అర్జున్. కానీ ఏమి జరిగిందో ఏమో కానీ సినిమా మొదలు కాకుండానే ఆగిపోయింది. అప్పటిలో టాలీవుడ్ లో ఈ విషయం దుమారమే లేపింది. అయితే ఈ సరి అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీయబోతున్నట్లు తెలుస్తుంది. తన కూతురికి ఎలాగైనా మంచి విజయాన్ని అందించాలి అనే కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
కన్నడ హీరో ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ ని హీరోగా పరిచయం చేస్తూ, ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా, ప్రకాష్ రాజ్, సత్య రాజ్, జయరాం లాంటి సీనియర్ నటులతో పాన్ ఇండియా రేంజ్ లో తన సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ పై కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు అర్జున్. ఈ సినిమాతో అయిన ఐశ్వర్య అర్జున్ కి మంచి విజయం దక్కాలని కోరుకుందాం.