Arjun Reddy pair: స్మాల్ బ్యూటీగా ‘షాలిని పాండే’కి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. పైగా ఆమె ఫేస్ లోనే మంచి హోమ్లీ నెస్ ఉంటుంది. ఇక తన పేస్ కి తగ్గట్టుగానే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎప్పటికప్పుడు కవ్విస్తూ ఉంటుంది ఈ బోల్డ్ హీరోయిన్. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాలిని, తన తొలి సినిమాతోనే కుర్రాళ్లను ఫిదా చేసింది. కాకపోతే, అమ్మడికి కాలం కలిసి రాలేదు. తనలో మ్యాటర్ ఉన్నా.. వెనుక సాలిడ్ హిట్ ఉన్నా ఎందుకో షాలినికి ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు.

ఇక సోలో హీరోయిన్ గా ఛాన్స్ రాకపోయే సరికి, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి చిత్రాల్లో చిన్నాచితక పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతానికి షాలిని కెరీర్ లో మరో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా అవి తన కెరీర్ కి మాత్రం ఉపయోగ పడట్లేదనే బాధలో ఉంది. ఇంకా అర్జున్ రెడ్డి దగ్గరే ఆగిపోయిందనే అపవాదుల నుంచి బయట పడటానికి ప్రస్తుతం షాలిని కసరత్తులు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఆమెకు ఒక భారీ ఆఫర్ తగిలింది. విజయ్ దేవరకొండతోనే తన తర్వాత చిత్రాన్ని ప్లాన్ చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలు హిట్ తర్వాత శివ నిర్వాణ నుంచి వచ్చిన ‘టక్ జగదీష్’ ప్లాప్ అయింది. అందుకే, విజయ్ తో చేయబోయే సినిమా పై భారీ వర్క్ చేస్తున్నాడు. అయితే, కథ ప్రకారం.. ఇద్దరు హీరోయిన్స్ అవసరం.
Also Read: Samantha: సమంత పై నెగిటివ్ కామెంట్స్.. ఇక వీడియో విడుదలైతే పరిస్థితేమిటో ?
ప్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ గా షాలిని పాండే అయితే బాగుంటుందని శివ నిర్వాణ ఫిక్స్ అయ్యాడు. మొత్తానికి అర్జున్ రెడ్డి కాంబినేషన్ ఈ రకంగా మళ్లీ కనిపించబోతుంది అన్నమాట. నిజానికి షాలిని ఇప్పటివరకు చేసిన సినిమాలు విజయాలు సాధించకపోవడంతో ఆమెకు ప్రస్తుతం ఆమెకు ఛాన్స్ లు లేవు.
మరి అర్ధాంతరంగా కిందకి పడిపోయిన తన కెరీర్ ను మళ్ళీ నిలబెట్టుకోవడానికి షాలిని పాండేకి ‘విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ సినిమా’ మంచి అవకాశం. మరి షాలిని ఈ సినిమాతోనైనా నిలదొక్కుకోవాలని ఆశిద్దాం.
Also Read: Pushpa: అయ్యో పుష్ప.. డబ్బింగ్ వెర్షన్ కి పెట్టిన డబ్బులు కూడా రానట్టేనా