Aditi Myakal: సినిమాల్లో ఒక్కచాన్స్ వస్తే చాలు తమ జీవితం మారిపోతుందని చాలా మంది భావిస్తారు. ఈ నేపథ్యంలో ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి రెడీ అవుతారు. అలా కొందరు హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ గా అవకాశం వచ్చినా చేసి ఆ తరువాత స్టార్ హీరోయిన్లుగా మారారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష ఒకప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ గా వచ్చిన ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో రచ్చ చేశాయ. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ గా వచ్చిన ఓ బేబీ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఆమె స్టార్ కాకపోయినా అందంతో యూత్ ను రెచ్చగొడుతోంది. ఇంతకీ ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూడండి.
విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్టు మూవీగా ‘అర్జున్ రెడ్డి’గా చెప్పుకోవచ్చు. అంతకుముందు వచ్చిన పూర్ లవ్ స్టోరీ ‘గీత గోవిందం’ తరువాత వచ్చిన ఈ మూవీలో విజయ్ కాస్త దూకుడుగా వ్యవహరించారు. హద్దులకు మించి రొమాన్స్ చేసి బోల్డ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయినా ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ వంగా హీందీలో రీమేక్ చేసినా అక్కడా సంచలన విజయం సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండకు మాత్రమే కాకుండా హీరో స్నేహితులుగా నటించిన వారికి గుర్తింపు వచ్చింది.
ఇందులో విజయ్ ఫ్రెండ్ గా నటించిన వాళ్లలో కళ్లద్దాలు పెట్టుకొని ఓ అమ్మాయి ఉంటుంది. సాధారణంగా ఆమెను ప్రత్యేకంగా ఎవరు గుర్తుపట్టరు. కానీ ఆమె ఇప్పుడు హీరోయిన్ అన్న విషయం కొంతమందికే తెలుసు. ఆమె పేరు అతిథి మ్యాకల్. ఈమె మొదట్లో షార్ట్ ఫిలింస్ లో నటించారు. ఆ తరువాత ‘అర్జున్ రెడ్డి’ సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తరువాత ఆమెకు కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ ‘అర్జున్ రెడ్డి’ తరువాత వచ్చిన వాటిలో ‘అమితుమీ’ అనే సినిమాలో మాత్రమే గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం ఈ భామ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. అందం, అభినయంతో కూడిన తన పిక్స్ ను సోషల్ మీడియాలో పెట్టి ఆకట్టుకుంటోంది. అర్జున్ రెడ్డి సినిమాలో కళ్లద్దాలతో డీ గ్లామర్ గా కనిపించినా.. రియల్ గా మాత్రం అమ్మడు హాట్ హాట్ ఫోజులు పెట్టి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో చాలా మంది ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని కోరుతున్నారు.