Bigg Boss 6 Telugu 7th Voting Results: ఈ ఏడాది బిగ్ బాస్ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్ళు ప్రేక్షకులకు పెద్దగా ముఖ పరిచయం లేనోళ్లే అని చెప్పొచ్చు..అలా ముఖ పరిచయం ఉన్న ఇద్దరు ముగ్గురిలో ఒకడు సింగర్ రేవంత్..హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు..ఇంత కోపం ఉంటె కష్టం అని హౌస్ మేట్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా అనుకున్నారు.

కానీ రోజులు గడిచే కొద్దీ రేవంత్ మీద ఉన్న ఆ అభిప్రాయం అందరిలో మారిపోయింది..టాస్కులు వస్తే చాలు చెలరేగిపొయ్యి ఆడే రేవంత్ తీరుని చూసి ప్రతి ఒక్కరు ముగ్దులు అయిపోయారు..నామినేషన్స్ కి వస్తే చాలు..రేవంత్ కి పడే ఓట్లలో పావు శాతం కూడా మిగిలిన ఇంటి సబ్యులకు వచ్చేది కాదు..కానీ శ్రీహాన్ ఒక్కడు వోటింగ్ శాతం లో రేవంత్ కి కాస్త దరిదాపుల్లో వచ్చే కంటెస్టెంట్..కానీ ఇప్పుడు రేవంత్ నువ్వా నేనా అనేంత రేంజ్ లో పోటీ ఇస్తున్నాడు అర్జున్ కళ్యాణ్..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది అనే చెప్పాలి.
అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన కొత్తల్లో వీక్ కంటెస్టెంట్స్ లో ఒకరు అని చెప్పొచ్చు..కానీ రోజులు గడిచే కొద్దీ అర్జున్ తన ఆట తీరుని మార్చుకుంటూ వచ్చాడు..ప్రారంభం లో సత్య చుట్టూ తిరగడం వల్లే తన గేమ్ ప్లాన్ మొత్తం పాడైంది అని ఇప్పుడు అతను ఆడుతున్న తీరుని చూస్తే అర్థం అవుతుంది..ఇప్పుడు ఆయన సత్య మీద కాకుండా గేమ్ మీద ద్రుష్టి సారించాడు..ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన అర్జున్ కళ్యాణ్ సోషల్ మీడియా లో జరుగుతున్న వోటింగ్ ప్రకారం ఏకంగా రేవంత్ ని దాటేయడం అందరిని ప్రేక్షకులను సైతం షాక్ కి గురి చేసింది..అర్జున్ కి అకస్మాత్తుగా ఇంత సపోర్ట్ ఎలా పెరిగిపోయింది అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

బిగ్ బాస్ సీసన్ 5 లో కూడా ఇలాగె జరిగింది..ఆ సీసన్ ప్రారంభమైనప్పటి నుండి మధ్యలో వరుకు షణ్ముఖ్ జస్వంత్ అందరికంటే ఎక్కువ ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగే వాడు..కానీ 8 వ వారం నుండి సన్నీ డామినేట్ చెయ్యడం ప్రారంబించాడు..చివరి వరుకు అలాగే డామినేట్ చేస్తూ టైటిల్ గెల్చుకున్నాడు..ఇప్పుడు అర్జున్ విషయం లో కూడా అదే జరగబోతుందా అనేది చూడాలి.