https://oktelugu.com/

‘ఆర్జీవీ’తో ఎఫైర్ పై అరియనా క్వశ్చన్ !

‘ఆర్జీవీ’ అనే వింత జీవి, కొత్త భామ అరియానాతో చేసిన సరికొత్త బాగోతం మొత్తానికి రిలీజ్ కి నోచుకుంది. ఇన్నాళ్లు తన పైత్యాన్ని సినిమా ప్రమోషన్స్ కే వాడిన, ఆర్జీవీ, ఇప్పుడు బూతు మయంతో నిండిపోయిన ఇంటర్వ్యూలకు తనదైన శైలిలో టచ్ ఇచ్చే క్రమంలో చేసిన ఇంటర్వ్యూనే ఈ రోజు రిలీజ్ అయింది. బోల్డ్ షాట్స్ తో పాటు ఆర్జీవీ – ఆరియానాల మధ్య జరిగిన బోల్డ్ మాటలు కూడా ఇంటర్వ్యూ పై కుర్రాళ్లకు ఆసక్తిని పెంచింది. […]

Written By:
  • admin
  • , Updated On : June 19, 2021 / 05:13 PM IST
    Follow us on

    ‘ఆర్జీవీ’ అనే వింత జీవి, కొత్త భామ అరియానాతో చేసిన సరికొత్త బాగోతం మొత్తానికి రిలీజ్ కి నోచుకుంది. ఇన్నాళ్లు తన పైత్యాన్ని సినిమా ప్రమోషన్స్ కే వాడిన, ఆర్జీవీ, ఇప్పుడు బూతు మయంతో నిండిపోయిన ఇంటర్వ్యూలకు తనదైన శైలిలో టచ్ ఇచ్చే క్రమంలో చేసిన ఇంటర్వ్యూనే ఈ రోజు రిలీజ్ అయింది. బోల్డ్ షాట్స్ తో పాటు ఆర్జీవీ – ఆరియానాల మధ్య జరిగిన బోల్డ్ మాటలు కూడా ఇంటర్వ్యూ పై కుర్రాళ్లకు ఆసక్తిని పెంచింది.

    దీనికి తోడు ఈ వీడియో ద్వారా అరియానాని వర్మ తెగ ప్రమోట్ చేశాడు. సహజంగా తన శైలిలో తన లాభం తానూ చూసుకుంటూ ముందుకు పోయే వర్మ, అరియానా పై ఇంత స్పెషల్ ‘ఇంట్రెస్ట్ పెట్టె సరికి అందరికి కలగాల్సిన అనుమానాలు కలిగాయి. ఈ అనుమానం పై సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా విపరీతంగా వచ్చాయి.

    దాంతో అరియనా వర్మతో ‘సర్.. మీరు నా గురించి ట్వీట్ చేసినప్పటి నుంచి బయట మన గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ఇద్దరి మధ్య ఎదో ఎఫైర్ ఉందని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు’ అంటూ మొత్తానికి అమాయక ఫేస్ పెడుతూ చక్కగా క్లారిటీగా అడిగింది. అయితే, అమ్మడు అమాయక ఫేస్ వైపు వర్మ తనదైన శైలిలో ఒక చూపు చూసి సమాధానం చెప్పుకొచ్చాడు.

    వర్మ మాటల్లోనే ‘ఈ అమ్మాయి ఇలా, ఆ అబ్బాయి అలా, వీడు అలాంటోడు, ఆమె అలాంటిది అంటూ మాట్లాడకపోతే సోషల్ మీడియా బ్యాచ్ కి నిద్ర పట్టదు కాబట్టి, వాళ్ళు మాట్లాడతారు. అందుకే, వాటిని పట్టించుకోవద్దు. మనం చెయ్యాల్సింది మనం చేసుకుంటూ ముందుకు పోదాం’ అని వర్మ చెప్పుకొచ్చాడు. ఇంతకీ అరియానాతో వర్మ చేయాల్సింది ఏముంది అనేదే ఇక్కడ పెద్ద డౌట్.

    రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి తన అందం గురించి కామెంట్ చేయడం వల్లే, తనకు బిగ్ బాస్ లో చోటు దక్కిందని, ఈ విషయంలో మీకు థాంక్స్ అంటూ ఆర్జీవీకి అరియనా చెప్పింది. కానీ వర్మ మాత్రం ఆ క్రెడిట్ తీసుకోదల్చుకోలేదట. “నాకు నీ ఫిగర్, నీ అందం ఇష్టం. అందుకే కామెంట్ చేశా’ అంటూ మళ్ళీ తన పైత్యం చూపించాడు.