Ariyana Glory : బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలబ్రిటీస్ లో ఒకరు అరియానా(Ariyana Glory). అంతకు ముందు ఈమె ఎవరో తెలుగు ఆడియన్స్ కి తెలిసేది కాదు. ఇన్ స్టాగ్రామ్(Instagram) లో ఒక సెలబ్రిటీ గా చాలా కాలం నుండి ఉంది కానీ, అంతగా ఎవ్వరూ పట్టించుకోలేదు. జీరో ఫ్యాన్ బేస్ తో బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టింది. టాప్ 4 వరకు వచ్చి మంచి కంటెస్టెంట్ గా బయటకు వెళ్ళింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె పలు సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. సీరియల్స్ లో కూడా కనిపించింది. ఇక ఎంటర్టైన్మెంట్ షోస్ విషయం లో అయితే చెప్పనక్కర్లేదు. అలా మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన ఈ బ్యూటీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ప్రభాస్ సినిమాని గుర్తుపట్టలేక ఆయన అభిమానుల చేత తిట్లు తింటుంది.
Also Read : రాజాసాబ్ మూవీలో అంత మేటర్ ఉందా? 10 ఏళ్ళు దాక మర్చిపోరట, హైప్ పెంచేసిన స్టార్ కమెడియన్
పూర్తి వివరాల్లోకి వెళ్తే, ప్రతీ ఆదివారం రాత్రి 7 గంటలకు ఈటీవీ లో ‘ఫ్యామిలీ స్టార్’ అనే షో టెలికాస్ట్ అవుతుంది. ఈ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. గత వారం ఒక సెలబ్రిటీ గా ఈ షోలో పాల్గొనేందుకు వచ్చిన అరియానా, ఒక గేమ్ లో ప్రభాస్(Rebel Star Prabhas) పోస్టర్ వద్ద తడబడింది. గేమ్ ఏమిటంటే LED స్క్రీన్ మీద కొన్ని కాంబినేషన్స్ వేస్తారు. ఆ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేర్లు కంటెస్టెంట్స్ గా వచ్చిన అరియనా మరియు ఆమె ప్రత్యర్థి టీం నుండి వచ్చిన మరో కంటెస్టెంట్ చెప్పాలి. అలా ప్రభాస్, శృతి హాసన్(Sruthi Hassan) లను కలిపి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు చెప్పమని అడుగుతాడు సుడిగాలి సుధీర్. కానీ అరియనా సమాధానం చెప్పలేకపోయింది. దీనిని ప్రభాస్ దురాభిమానుల సోషల్ మీడియా లో తెగ తిప్పేస్తున్నారు.
‘సలార్'(Salaar Movie) చిత్రాన్ని ప్రభాస్ అభిమానులు గ్లోబల్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన సినిమాగా చెప్తుంటారు. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమా అది. అలాంటి సినిమాని కూడా జనాలు మర్చిపోయారు అనడానికి నిదర్శనం ఇదే అంటూ ఒక ఎన్టీఆర్(Junior NTR) అభిమాని ఆ వీడియో ని పోస్ట్ చేసారు. ఇదే వీడియో ని ఇతర హీరోల అభిమానులు కూడా రీ పోస్ట్ చేస్తూ బాగా వైరల్ చేసారు. దీంతో ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ అభిమానులు అరియనా ని తిట్టడం మొదలు పెట్టారు. ప్రభాస్ సలార్ సినిమా గుర్తు లేదా నీకు?, కావాలనే అలా చెప్పావు కదా అంటూ ఆమెపై ట్రోల్స్ వేస్తున్నారు. దీనికి అరియానా నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం ఈ వీడియో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. ఆ వీడియో ని మీరు కూడా చూడండి.
Prithviraj or Prashant Neel photo esthe cheppedhi emo .. pic.twitter.com/oxofvotNs3
— Orey 186 (@orey_tweets) March 10, 2025