https://oktelugu.com/

Aadipurush : ‘ఆదిపురుష్’ డైలాగ్స్ మొత్తం మార్చేస్తున్నారా..! సంచలన ప్రకటన చేసిన నిర్మాతలు

మేకర్స్ డైలాగ్స్ మొత్తాన్ని రీ మోడిఫై చేసి , ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా రేపటి నుండి ఈ చిత్రానికి జతచెయ్యబోతున్నామని అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 18, 2023 / 05:04 PM IST
    Follow us on

    Aadipurush : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అవ్వడం, ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం తో ఇలాంటి టాక్ వచ్చింది. కానీ రామాయణం ఇతిహాసం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు..?, జై శ్రీ రామ్ అనే పదం వింటేనే మన పూనకాలు వచ్చేస్తాయి.

    అందుకే ఈ సినిమాకి టాక్ లేకపోయినా కూడా వసూళ్లు ఈ రేంజ్ లో వస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ చిత్రం సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం ఇసుమంత ఎమోషన్స్ కూడా పండకపోవడం వల్లే జనాలు సరిగా కనెక్ట్ కాలేకపోయారని అంటున్నారు విశ్లేషకులు.

    అంతే కాకుండా ఈ సినిమాలో డైలాగ్స్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని, కనీసం డైలాగ్స్ ఆకట్టుకొని ఉన్నా చిత్రం యావరేజి ఫీలింగ్ ని అందరికీ కలిగించి ఉండేదని అంటున్నారు. ప్రేక్షకుల నుండి వచ్చిన ఈ కామెంట్స్ అన్నిటినీ గమనించిన మేకర్స్ డైలాగ్స్ మొత్తాన్ని రీ మోడిఫై చేసి , ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా రేపటి నుండి ఈ చిత్రానికి జతచెయ్యబోతున్నామని అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసారు.

    ఇందువల్ల సినిమాకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ చిత్రానికి కనీసం వారం రోజులైనా ఫ్యామిలీ ఆడియన్స్ ప్రవాహం థియేటర్స్ కి ఉంటుందని, కాబట్టి వాళ్లకి నచ్చితే కచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటున్నారు. మరి మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సినిమాకి ఎంత మేలు జరుగుతుందో చూడాలి.