https://oktelugu.com/

Varun Tej- Lavanya Tripathi Marriage: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన మరో జంట ఒక్కటవబోతుంది.. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారని.. జూన్ 9న నిశ్చితార్థం కూడా చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కలిసి 2017లో ‘మిస్టర్’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 2, 2023 / 06:51 PM IST

    Varun Tej- Lavanya Tripathi Marriage

    Follow us on

    Varun Tej- Lavanya Tripathi Marriage: సినీ పరిశ్రమలలో పనిచేసేవారు పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. హీరో హీరోయిన్లుగా నటించిన చాలా మంది రియల్ లైఫ్ లో నూ కలిసి ఉంటున్నారు. ఇలా పెళ్లి చేసుకునేవారిపై ముందుగా కొన్ని రోజుల పాటు వార్తలు హల్ చల్ చేస్తాయి. ఆ తరువాత అలాంటిదేమీలేదని అంటారు.. కానీ మేం పెళ్లి చేసుకోబోతున్నాం.. అని చెబుతారు. ఇప్పుడు కొత్తగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలపై కొన్ని రోజులుగా అదే పనిగా కథనాలు వస్తున్నాయి. వీరిద్దరు కొంతకాలం ప్రేమించుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అయితే అటు వరుణ్ తేజ్ గానీ.. ఇటు లావణ్య గానీ స్పందించడం లేదు. దీంతో అసలు వీరిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? అనే చర్చ మొదలైంది.

    టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన మరో జంట ఒక్కటవబోతుంది.. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారని.. జూన్ 9న నిశ్చితార్థం కూడా చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కలిసి 2017లో ‘మిస్టర్’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. ఆ తరువాత ‘అంతరిక్షం’ అనే మూవీలో మరోసారి కలిశారు. ఈ సమయంలోనే వీరి ప్రేమ చిగురించింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి తిరుగుతన్నారని సమాచారం. అయితే వీరు పెళ్లి చేసుకోవడానికి ఇద్దరూ తమ ఇళ్లల్లో ప్రతిపాదనలు పెట్టగా ఓకే చెప్పారు.

    ఆ మధ్య నాగబాబు త్వరలో వరుణ్ తేజ్ ను త్వరలో పెళ్లి కొడుకుగా చూడబోతున్నారంటూ కామెంట్ చేశారు. దీంతో అప్పటి నుంచి నాగబాబుకు ఈ విషయం తెలుసునని అందరూ అనుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ కూడా ఈ పెళ్లికి ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఇక లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించారు. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది. తల్లి ఉపాధ్యాయురాలు. లావణ్య త్రిపాఠి మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ను గెలుచుకున్నారు.

    ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి వార్తలు జోరందుకున్నా.. వీరిద్దరు ఎలాంటి కామెంట్ చేయడం లేదు. దీంతో వీరిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? అనే చర్చ సాగుతోంది. అయితే పరిస్థితులను భట్టి వీరిద్దరు ఒక్కటవుతారని తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి వార్తలు అబ్ధమైదే వీరు ఖండిస్తారు.. అలా చేయడం లేదనంటే వీరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లేగా? అని అనుకుంటున్నారు.