Bichagadu Movie Heroine: తల్లి సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడాలనే ఉద్దేశంలో యాచకుడిగా మారిన ఓ యువకుడి కథగా రూపొందిచిన చిత్రం ‘బిచ్చగాడు’. దీనిని ముందుగా తమిళంలో రిలీజ్ చేసిన తరువాత తెలుగులో విడుదల చేశారు. ఇక్కడా బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టింది. ఈ క్రమంలో ఇందులో నటించిన వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఇందులో విజయ్ ఆంటోని సరసన నటించిన భామ అందిరకీ గుర్తుండే ఉంటుంది.కొన్నాళ్లు ఇండస్ట్రీలో హల్ చల్ చేసిన ఈమె ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆమె ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
‘బిచ్చగాడు’ సినిమాలో లవ్ సీన్స్ తక్కువగానే ఉంటాయి. కానీ వాటికి ప్రాధాన్యం సంతరించుకుంటాయి. బిచ్చగాడి ప్రియురాలిగా నటించిన అమ్మాయి పేరు సాట్నా టైటస్. ఈమె కేరళలోని కొచ్చిలో 1991 నవంబర్ 28న జన్మించారు. చదువు పూర్తి చేసుకున్న తరువాత ఈమె సినిమాలపై ఉన్న ఆసక్తితో పలువురిని సంప్రదించారు. చివరికి తమిళ ‘పిచ్చైక్కారన్(బిచ్చగాడు) సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.
ఆ తరువాత యీథవన్, నీది నాదీ ఒకే కథ, తిట్టం పొట్టు తిరుదుల కూటం చిత్రాల్లో నటించింది. మొదటి సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎక్కువకాలం సినిమాల్లో కొనసాగలేకపోయింది. ఎందుకంటే బిచ్చగాడు సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూటర్ చేసిన కార్తీతో ఆమె ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరి వివాహాన్ని ఇంట్లో ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
సాట్నా తల్లిదండ్రులు మొదట వీరి వివాహాన్ని ఒప్పుకోలేదు. అంతేకాకుండా కార్తీపై కేసు కూడా పెట్టారు. కానీ వీరు అన్యోన్యంగా జీవించడం చూసి వారి తల్లిదండ్రులు కేసును వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు ఉన్నారు. అయితే కార్తీని పెళ్లి చేసుకునే సమయంలో సాట్నా చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. కొన్నింటికి అడ్వాన్స్ కూడా తీసుకుంది. కానీ తన పెళ్లి వివాదంగా మారడంతో వాటిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తరువాత పూర్తిగా ఫ్యామిలికే అంకితమైంది.