Surekha helped Tollywood stars: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు బాగా వర్క్ అవుట్ అవుతూ ఉంటాయి. స్టార్ హీరోలు సైతం ఆ సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అందుకోసమే వాళ్ళ సినిమాలకు ముహూర్తం దగ్గర నుంచి సినిమా రిలీజ్ డేట్ వరకు ముందే పకడ్బంది ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఇక మరి కొంతమంది మాత్రం ఎలాంటి సెంటిమెంట్లను పట్టించుకోకుండా సినిమాలను చేస్తూ ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది… ఇండస్ట్రీ లో మాత్రం సెంటిమెంట్లను నమ్మే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా కెరియర్ మొదట్లో కొన్ని సెంటిమెంట్లను నమ్మాడు. మొత్తానికైతే ఇండస్ట్రీలో ఆయన ఎంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే…
చిరంజీవికి చాలా టాలెంట్ ఉన్నప్పటికి సురేఖ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు అదృష్టం కలిసి వచ్చిందని చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే సురేఖ చేతుల మీదుగా కొన్ని డబ్బులు తీసుకున్న చాలా మంది ఇండస్ట్రీలో పైకి వచ్చారనే విషయం మనలో చాలామందికి తెలియదు… మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో అతనికి సినిమా ఖర్చుల కోసం ఉంచుకోమని 2000 రూపాయలు ఇచ్చిందట.
అప్పట్లో 2000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు… ఇక ఇదే నీ ఫస్ట్ రెమ్యునరేషన్ అనుకో అని కూడా చెప్పిందట. దాంతో అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఆ తర్వాత బన్నీ వాసు డిస్ట్రిబ్యూటర్ గా మారి ఆర్య సినిమాని పాలకొల్లు ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నాడట. కానీ అతని దగ్గర అప్పుడు డబ్బులు లేకపోయేసరికి సురేఖ దగ్గర 5000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడట…
ఇక ఆమె హస్తవాసి మంచిది కావడం ఆమె చేయికి చాలా అదృష్ట బలం ఉండటంతో ఆమె ఇచ్చిన డబ్బులతో బన్ని వాసు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగానని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సురేఖ గారి గొప్పతనం గురించి చెబుతూనే ఒకప్పుడు ఆమె అప్పు గా తీసుకున్న 5000 రూపాయలను ఇప్పటివరకు ఇంకా తిరిగి చెల్లించలేదని ఆమె చేయి చాలా మంచిదని ఆమె వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు…