Heroes Remuneration: సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి క్లిక్ అయితే చాలు నేమ్ తో పాటు ఫేమ్ డబ్బులు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. అందుకే ఒక్క సినిమాతో చాలా మంది కోటీశ్వరులు అవుతుంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే స్టార్ హీరోలు కొంతమంది ఎలాంటి సినిమాలు చేసిన కూడా పారితోషకం విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారనే విషయం మనలో చాలామందికి తెలియదు… ముఖ్యంగా రవితేజ లాంటి నటుడు తను కమిట్ అయిన రెమ్యూనరేషన్ ను ఎలాగైనా సరే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి తీసుకుంటాడట. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా తను కి ఒప్పుకునే డబ్బులను తనకు ఇచ్చేయాలంటూ అతను ముందుగానే కండిషన్స్ పెడుతుంటాడని అతనితో సినిమాలు చేసిన కొంతమంది ప్రొడ్యూసర్లు చెబుతున్నారు. నిజానికి దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య తో చేసిన వీర సింహారెడ్డి సినిమా తర్వాత రవితేజ తో ఒక సినిమాను స్టార్ట్ చేశాడు… దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యేవిధంగా ఉందని అందుకోసం రవితేజను తన రెమ్యూనరేషన్ కొంత తగ్గించుకోమని చెప్పినప్పటికి రవితేజ మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించుకునేదే లేదు. కావాలంటే ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటాను అని చెప్పాడట. మొత్తానికైతే మైత్రి వాళ్ళు ఈ సినిమాను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని బాలీవుడ్ స్టార్ హీరో అయిన సన్నీ డియోల్ తో ‘జాట్’ అనే సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు…
ఇక రవితేజ తో పాటు నాగార్జున సైతం తను ఒప్పుకున్న రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడట. కొన్ని సందర్భాల్లో సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అందులో కొంత పర్సెంట్ వెనక్కి ఇచ్చేసినప్పటికి చాలా సందర్భాల్లో నాగార్జున తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతుంటాడట… ఇలా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు…
ఇక వీళ్ళు ఇలా ఉండటం పట్ల కొందరు వీళ్లను విమర్శిస్తుంటే మరి కొంతమంది మాత్రం వాళ్లకి రావాల్సిన డబ్బుల విషయంలో వాళ్ళు అలా ఉండటం లో తప్పులేదు… ప్రొడ్యూసర్స్ కి లాభాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఒప్పుకున్న దాని కంటే ఎక్కువ ఇవ్వడం లేదు కదా అంటూ వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారు…