National Award Best Lyricist: ఒక సినిమా సక్సెస్ లో సాంగ్స్ అనేవి కీలకపాత్ర వహిస్తూ ఉంటాయి. నిజానికి సినిమాలో ఉన్న భావాన్ని సాహిత్య రూపంలోకి మార్చి దానికి మ్యూజిక్ ని ఆడ్ చేసి ప్రేక్షకుల్లోకి వదిలితే ఆ పాటలను విని ఆడియన్స్ సంబరపడిపోతుంటారు. ఇక దాంతోపాటుగా మ్యూజిక్ కి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉందని చెబుతుంటారు. కాబట్టి సినిమా రిలీజ్ కి ముందే సాంగ్స్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఒక లోకంలోకి తీసుకెళ్లి వాళ్ళను పరవశితులను చేస్తూ సినిమ మీద హైప్ పెంచుతుంటారు. అలాగే సినిమాలో పాటలు వచ్చినప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్న కష్టాలను మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి సినిమా సక్సెస్ లో మ్యూజిక్ అనేది చాలా కీలకపాత్ర వహిస్తోంది. అలాగే మన రైటర్స్ రాసే లిరిక్స్ సైతం ప్రేక్షకులను ఆలోచింప చేస్తూ ఉంటాయి… ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది లిరిక్ రైటర్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వాళ్లు రాసే పదాల చేత వాళ్ళని మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు. మరి ఇదిలా ఉంటే లిరిక్ రైటర్స్ కి కూడా నేషనల్ అవార్డు ఇస్తారనే విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటివరకు తెలుగు నుంచి కేవలం ఐదుగురు మాత్రమే బెస్ట్ లిరిక్ రైటర్ గా నేషనల్ అవార్డుని గెలుచుకున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు.
Also Read: మహేష్ బాబు ను ఫాలో అయి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు ఎవరో తెలుసా..?
కృష్ణ హీరోగా వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో తెలుగు వీర లేవరా అనే పాటకు గాను శ్రీ శ్రీ కి బెస్ట్ లిరిక్ రైటర్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది. ‘మాతృదేవోభవ’ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకి గాను వేటూరి సుందర్ రామ్మూర్తి కి నేషనల్ అవార్డు అయితే వచ్చింది…
తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ సినిమాలో నేను సైతం అనే పాట రాసినందుకు గాను సుద్దాల అశోక్ తేజ కి నేషనల్ అవార్డ్ వరించింది… ఇక వీళ్ళతోపాటుగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ‘కొండపొలం’ సినిమాలో దమ్ దమ్ దమ్ అనే పాట రాసినందుకు చంద్రబోస్ కి నేషనల్ అవార్డు వరించింది.
ఇక రీసెంట్గా ‘బలగం’ సినిమాలో ఊరు పల్లెటూరు అనే పాట రాసినందుకుగాను కాసర్ల శ్యామ్ కి నేషనల్ అవార్డు వరించింది. మరి మొత్తానికైతే ఈ లిరిక్ రైటర్స్ వాళ్లు రాసే పదాల చేత ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే వాళ్లలో స్పూర్తిని పెంచుతూ సమాజానికి ఏదో ఒక రకంగా సేవలు చేస్తూ ముందుకు సాగుతున్నారు…