Director Teja actors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూత్ ఫుల్ సినిమాలను చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరైన దర్శకుడు తేజ…’చిత్రం’ సినిమాతో యూత్ ఎలా ఉంటారు వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అనేది కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇక దాంతో పాటుగా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాలేజీకి వెళితే అక్కడ ఎలాంటి ఇన్సూడెన్స్ జరుగుతాయి అనేది కూడా ఈ సినిమాలో చూపించిన ఘనత అతనికే దక్కుతోంది. ఈ సినిమాతో సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత ‘నువ్వు నేను’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆరోజుల్లో యూత్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి. దానికోసం వాళ్ళు ఎక్కడ దాకా వెళ్తారు అనే పాయింట్ ను చాలా క్లియర్ కరెక్ట్ గా చూపించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘జయం’ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇలా వరుసగా మంచి సినిమాలు చేసుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇప్పటి వరకు చాలామంది కొత్త యాక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నితిన్, నవదీప్, బలగం వేణు, శ్రీనివాస్ రెడ్డి, కాజల్, రీమాసేన్, అనిత లాంటి చాలామంది నటీనటులను పరిచయం చేశాడు. మొత్తానికైతే వాళ్ళందరూ మంచి పొజిషన్ లో ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తేజ ఇప్పుడు మరి కొంతమంది కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే పనిగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు అనుకున్న మేరకు సక్సెస్ లు రాకపోయిన కూడా ఆయన ఎక్కడ డీలా పడకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ‘రాక్షస రాజా’ అనే సినిమా స్టార్ట్ చేసినప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఇంకో ప్రాజెక్ట్ తో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలను చేసిన కూడా తేజ చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని ఒక పేరునైతే సంపాదించుకున్నాడు. అలాగే ఆర్టిస్టుల దగ్గర నుంచి పూర్తిస్థాయి నటనను రాబట్టుకోవడంలో ఆయన ఏదైనా చేస్తాడు అనే ఒక పేరు కూడా సంపాదించుకున్నాడు. తను అనుకున్నట్టుగా చేయించుకోవడానికి ఆర్టిస్టులను కొడుతుంటాడు అని చాలా మంది ఆయన చేతిలో దెబ్బలు తిన్న నటీనటులు చెబుతుండటం విశేషం…