Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ వల్లనే వాళ్లు జనాల్లో ఎక్కువగా గుర్తింపును సంపాదించుకుంటారు. ఒక హీరోకి ఒక స్టైల్ అనేది ఏర్పడినప్పుడే తను స్టార్ హీరోగా ఎదుగుతాడు అనేది వాస్తవం. అందుకే ఇపుడున్న స్టార్ హీరోలందరికీ సపరేట్ గా ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క మేనరిజం ఉంది.
ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాత్రం తన స్టైల్ తో తెలుగులో ఉన్న యూత్ మొత్తాన్ని ఆకర్షించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన చాలామంది నటులు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్లు పవన్ కళ్యాణ్ స్టైల్ ని ఫాలో అవుతూ హీరోలుగా ఎదుగుతూ వచ్చారు. వాళ్లలో ఎనర్జిటిక్ హీరో గా పేరు పొందిన రామ్ పోతినేని ఒకడు. మొదటి సినిమా నుంచి కూడా ఈయన కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్ ని ఇమిటెడ్ చేస్తూ నటించడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకొని ప్రస్తుతానికి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు…
ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకునే నితిన్ కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ని కాపీ కొట్టడమే కాకుండా ఆయన సీన్లని, ఆయన పాటలని యాస్ ఇట్ ఈజ్ వాడుకుంటూ సినిమాలను సక్సెస్ చేసుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో ఆయన సినిమా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు సినిమాలోని ఒక పాట లో వేసిన స్టెప్ ని నితిన్ వేశారంటా.
ఆయన చెప్పిన డైలాగ్ ని చెప్పాడట అలా తనకు ఆయన పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఉండడం వల్లే ఆయన స్టైల్ ని నరనరాల్లో నింపుకున్నాడు. తను కూడా నటుడే కాబట్టి తనకు తెలియకుండానే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తనలో కాలిపోయింది. అందుకే తను నటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టింగే కనిపిస్తూ ఉండేది. ఇక వీళ్లిద్దరూ యంగ్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తునే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. ఇక వీళ్లే కాకుండా మరి కొంతమంది అప్ కమింగ్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఇమిటేట్ చేస్తూ ఉంటారు…