https://oktelugu.com/

RRR Komaram Bheem: RRR లో కొమురం భీమ్ పాత్రని వదులుకున్న హీరోలు వీళ్లేనా??

RRR Komaram Bheem: RRR సినిమా లో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్ర పై దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రశంసల వర్షం కురిసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..చిన్న పిల్లాడి మనస్తత్వం మరియు ఆంజనేయ స్వామి కి ఉన్న కొండంత బలం ఎన్టీఆర్ పోషించిన ఈ పాత్రలో చూడవచ్చు..ఈ సినిమాలోని చాలా సన్నివేశాలకు ఎన్టీఆర్ చేసిన నటన కి మన కళ్ళలో నుండి నీళ్లు రాక తప్పదు..ఈ పాత్రని ఆయన తప్ప ఇండియా లో మరో హీరో చెయ్యలేదు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 20, 2022 / 04:14 PM IST
    Follow us on

    RRR Komaram Bheem: RRR సినిమా లో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్ర పై దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రశంసల వర్షం కురిసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..చిన్న పిల్లాడి మనస్తత్వం మరియు ఆంజనేయ స్వామి కి ఉన్న కొండంత బలం ఎన్టీఆర్ పోషించిన ఈ పాత్రలో చూడవచ్చు..ఈ సినిమాలోని చాలా సన్నివేశాలకు ఎన్టీఆర్ చేసిన నటన కి మన కళ్ళలో నుండి నీళ్లు రాక తప్పదు..ఈ పాత్రని ఆయన తప్ప ఇండియా లో మరో హీరో చెయ్యలేదు అనే విధంగా ఆయన ఆ పాత్రలో లీనమైపోయాడు..ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొమురం భీముడొ పాట కి కంటతడి పెట్టకుండా ఉన్న ప్రేక్షకుడు ఎవ్వరు లేరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఎన్టీఆర్ ఈ పాటలో పండించిన హావభావాలు ప్రతి ఒక్కరి గుండెల్లో నేరుగా గుచ్చుకుంది..అంత అద్భుతంగా ఆయన తన పాత్రకి న్యాయం చేసాడు..కానీ ఇప్పుడు ఈ క్యారక్టర్ కి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Jr NTR

    ఇక అసలు విషయానికి వస్తే ఈ పాత్ర కోసం తొలుత హీరో సూర్య ని అనుకున్నారు అట మన రాజమౌళి..అప్పట్లో రామ్ చరణ్ – సూర్య కాంబినేషన్ లో రాజమౌళి సినిమా అని వార్తలు వస్తే మనం రూమర్స్ అని అనుకున్నాము..కానీ అది రూమర్ కాదు అని..నిజమే అని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు..కానీ ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో ఈ సినిమాలో నటించలేకపొయ్యాడు..ఇక ఆ తర్వాత ఆ పాత్ర కోసం తమిళ హీరో ధనుష్ ని అలాగే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఇలా పలు స్టార్ హీరోలను అనుకున్నప్పటికీ ఈపాత్రకి ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చెయ్యగలడు అని భావించి ఆయనకీ స్టోరీ వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పేసాడు..దాని ఫలితమే ఈరోజు మన అందరం చూస్తున్నాము..ఎన్టీఆర్ అంటే మన ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క పెద్ద మాస్ హీరో..ఆయన నుండి భారీ లెవెల్ ఎలేవేషన్స్ మరియు యాక్షన్ సీన్స్ ని మాత్రమే అభిమానులు ఆయన నుండి కోరుకుంటారు..కానీ ఆ స్థాయి సన్నివేశాలు అన్ని రామ్ చరణ్ కి పడగా..ఎన్టీఆర్ కి చాలా ఎమోషనల్ క్యారక్టర్ పడింది.

    Surya Allu Arjun Dhanush

    Also Read: RRR Collections: అన్నీ వందల కోట్లా ? బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది !

    తమ హీరో పాత్ర బాగా తగ్గింది అని..రామ్ చరణ్ క్యారక్టర్ ని బాగా హైలైట్ చేసి మా హీరో ని తొక్కేశారు అని అభిమానులు విడుదల అయిన రోజు నుండి సోషల్ మీడియా లో రాజమౌళి ని టాగ్ చేస్తూ తిడుతూనే ఉన్నారు..కానీ ఎన్టీఆర్ ని ఫామిలీ ఆడియన్స్ కి ఈ పాత్ర దగ్గర చేసినట్టు..గతం లో ఆయన చేసిన చేసిన 27 సినిమాలు కూడా చెయ్యలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఫామిలీ ఆడియన్స్ లో ఎన్టీఆర్ చాలా వీక్ అనే మాట ఈ సినిమా తర్వాత నుండి ఉండబోదు అని ట్రేడ్ పండితుల అంచనా..కొమురం భీం పాత్ర తనని ఫామిలీ ఆడియన్స్ కి అంత దగ్గరగా చేసింది అని వారి గట్టి నమ్మకం..మరి వారి అంచనాలు ఎంత వరుకు రీచ్ అయ్యాయో తెలియాలి అంటే ఎన్టీఆర్ తదుపరి సినిమా విడుదల అయ్యే వరుకు వేచి చూడాల్సిందే..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక్క సినిమా చేయబోతున్నాడు..ఈ సినిమా జూన్ నెల నుండి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంబించుకోనుంది.

    Also Read: Star Heroes: స్టార్ హీరోలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవే..!

    Recommended Videos:

    Tags