Pan India Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచనాలను క్రియేట్ చేస్తూ పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని మన స్టార్ డైరెక్టర్లందరు ముందుకు సాగుతున్నారు. మరి దానికి అనుగుణంగానే మన హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ప్రతి ఒక్కరి టార్గెట్ పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించడమే కావడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలోనే సక్సెస్ ఫుల్ సినిమాలను చేయగలగే హీరోలు నలుగురు మాత్రమే ఉన్నారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు మాత్రమే పాన్ ఇండియాలో భారీ విజయాలను అందుకోగలిగే కెపాసిటీ ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…
Also Read: ‘అఖండ 2’ సెకండ్ హాఫ్ పై బాలయ్య అసంతృప్తి?
ఎందుకు అంటే వీళ్ళకి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను బట్టి అందరికంటే ఎక్కువ క్రేజ్ అయితే ఉంది. పాన్ ఇండియాని శాసించే స్థాయిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ల సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి అంటూ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
హిట్టు తో పాటు ప్లాపులు వస్తున్నప్పటికి ఓవరాల్ గా భారీ విజయాలను అందుకొని ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలను చేయగలిగే కెపాసిటీ ఈ నలుగురికి మాత్రమే ఉందని వాళ్ళు తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తూ వస్తున్నప్పటికి ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కాబట్టి ఆయన కెరియర్ గ్రాఫ్ అనేది తెలుగుకే పరిమితమైంది. మరి రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లోకి కూడా దూసుకెళ్తున్నాడు.
Also Read: ‘ఓజీ’ టీం పై పవన్ కళ్యాణ్ అభిమానులు అసహనం..కారణం ఏమిటంటే!
కాబట్టి ఆయన సినిమా వచ్చేంత వరకు ఆయన మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది ఎవ్వరు చెప్పలేరు… ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ నలుగురు హీరోలకు మాత్రమే పాన్ ఇండియాలో మంచి గుర్తింపైతే ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు వీళ్ళ సినిమాలు వచ్చినా కూడా మినిమం కలెక్షన్స్ అయితే వసూలు చేయగలిగే కెపాసిటి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…