Pawan Kalyan Fans OG Team: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు మాత్రమే కాదు, ఈసారి మెగా అభిమానులు కూడా ‘ఓజీ'(They Call Him OG) చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా కాలం తర్వాత ఒక మెగా హీరో సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసిన చిత్రం ఇదే కాబట్టి, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న మెగా ఫ్యామిలీ ని ఈ సినిమా రక్షిస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదల చేసిన కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రెండేళ్ల క్రితం విడుదలైన గ్లింప్స్ వీడియో ఈ సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ అయితే మ్యూజిక్ లవర్స్ ని పిచ్చెక్కిపోయేలా చేసింది. ఇది కదా మేము పవన్ కళ్యాణ్ సినిమా నుండి కోరుకునేది అనే రేంజ్ ఫీలింగ్ ని ఇచ్చింది ఈ పాట.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
విడుదలై 18 రోజులు పూర్తి అయినప్పటికీ కూడా ఈ పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉందంటే ఏ రేంజ్ చార్ట్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అభిమానులు ఓజీ కంటెంట్ పరంగా వేరే లెవెల్ సంతృప్తి తో ఉన్నారు. కానీ ప్రొమోషన్స్ విషయం లోనే అభిమానులు సంతృప్తి గా లేరు. ఎంతో హుషారుగా ఉండే ప్రొడక్షన్స్ కూడా మా సినిమా వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా విడుదలకు సరిగ్గా 35 రోజుల గడువు మాత్రమే ఉంది. మొదటి పాట విడుదలై 18 రోజులు పూర్తి అయ్యింది. 5 రోజుల క్రితం రెండవ పాటకు సంబంధించిన ప్రోమో ని త్వరలోనే విడుదల చేస్తామని హీరోయిన్ పోస్టర్ ద్వారా అధికారికంగా సోషల్ మీడియా లో తెలిపారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఉలుకు పలుకు లేదు. ఇదే అభిమానులకు చిరాకు కలిగిస్తుంది.
ఓజీ ప్రొడక్షన్ టీం వచ్చిన మరో సమస్య ఏమిటంటే కనీసం ఎప్పుడు విడుదల అవుతుంది అనే క్లారిటీ కూడా ఇవ్వరు. సడన్ గా వస్తారు, అప్డేట్ ఇచ్చి వెళ్ళిపోతారు. కనీసం ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయమైనా తెలిస్తే అభిమానులు ఎదురు చూసేందుకు వీలుగా ఉంటుంది. ఒక అభిమాని కి తన అభిమాన హీరో కి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూడడం లో కూడా ఒక మజా ఉంటుంది. దానికి దూరం చేస్తున్నారు ఓజీ మేకర్స్. హరి హర వీరమల్లు టీం ప్రొమోషన్స్ అత్యంత దారుణంగా చేసి సినిమా మీద ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయలేకపోయింది. కానీ ఓజీ చిత్రానికి అద్భుతమైన క్రేజ్ ఉంది, కానీ నిర్మాతలు ఆ క్రేజ్ ని సరిగా ఉపయోగించుకోవడం లేదనే కంప్లైంట్స్ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ నుండి ఎక్కువగా వస్తున్నాయి.