Deepika Padukone team: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ పని సాధిస్తున్నాయి. మరి అలాంటి సందర్భంలోనే చాలామంది హీరోలు పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు దూసుకెళ్తుండడం వల్ల మన తెలుగు సినిమాలకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గిరాకీ అయితే ఏర్పడుతోంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాలకు భారీ క్రేజ్ అయితే దక్కుతోంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దీపికా పదుకొనె ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటే ప్రయత్నం అయితే చేస్తోంది. ‘కల్కి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరవుతుంది. మరి ఇలాంటి ఒక టాప్ హీరోయిన్ ను ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాల నుంచి తనను తీసేస్తుండడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. నిజానికి ఇందులో ఆమె తప్పు కూడా ఉంది. ఆమె పెట్టే డిమాండ్స్ అలా ఉన్నాయని ఆమె కండిషన్స్ కి ఒప్పుకోవడం చాలా కష్టమని ప్రొడ్యూసర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఆమె వెంట ఒక 25 మంది మెంబర్స్ ఉంటారు.
అందులో ముగ్గురు కాస్ట్యూమర్స్, ఇద్దరు మేకప్ మెన్స్ ఇక మిగతా వారు తన పర్సనల్ వ్యవహారాలు చూసుకునేవారు. ఈమెను భరించడమే ఒక ఎత్తు అంటే ఆ 25 మందిని చూసుకోవడం మరొకెత్తుగా మారింది. ఇదంతా ప్రొడ్యూసర్ మీద అదనపు భారం…ఇక దీపిక తో వచ్చిన వాళ్లను ప్రతి విషయంలో కేర్ఫుల్ గా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ప్రొడ్యూసర్ మీదనే ఉంటుంది. ఔట్ డోర్ షట్ కి వెళ్తే వాళ్లకు కావాల్సిన రూములను రెడీ చేయాలి.
అందరికీ ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే రూమ్ లు ఇవ్వాలి. ఇదంతా చూస్తుంటే ప్రొడ్యూసర్ వీళ్ల మీద పెట్టే ఖర్చుతో ఒక మీడియం బడ్జెట్ సినిమా తీయొచ్చు. మరి ప్రొడ్యూసర్ ఇవన్నీ భరించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని…కాబట్టి అందుకే ఆమెను తీసేసి వేరే హీరోయిన్స్ ను తీసుకుంటున్నారు.
ఆమెను పెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అందరూ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే మొదట స్పిరిట్ సినిమా నుంచి సందీప్ రెడ్డివంగ ఆమెను తీసేస్తే, రీసెంట్ గా కల్కి సినిమా నుంచి ఆమె ను తీసేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆమెకి డిమాండ్ ఉంది అనుకోవడంలో తప్పులేదు. కానీ డిమాండ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా కండిషన్స్ పెడితే మాత్రం తీసి పక్కన పెడతారు…